Telugu women place in Indian women cricket team

Telugu women place in indian women cricket team

Indian Cricket, Women cricket Team, Women Cricket Tourney, Australia series

hyderabadi cricket player also doing captaincy to women cricket team. Now Rani Kalpana got place as a wicket keeper.

మహిళల క్రికెట్ టీంలో మన వాళ్లు దూసుకెళుతున్నారు

Posted: 01/09/2016 03:40 PM IST
Telugu women place in indian women cricket team

హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆస్ట్రేలియాలో పర్యటించే భారత మహిళల వన్డే, టి20 జట్లకు నాయకత్వం వహించనుంది. ఈనెల 26న మొదలయ్యే ఈ సిరీస్ లో భారత్ మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. వన్డే జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వికెట్ కీపర్ రావి కల్పనకు స్థానం లభించింది. టి20 జట్టులో కల్పన, పూనమ్ రౌత్, స్నేహ రాణే స్థానాల్లో వనిత, అనూజా పాటిల్, దీప్తి శర్మలను ఎంపిక చేశారు. అయితే మహిళల క్రికెట్ జట్టులో తెలుగు అమ్మాయికి స్థానం లభించడం విశేషం.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జనవరి 26న (అడిలైడ్), రెండో టి20 మ్యాచ్ జనవరి 29న (మెల్బోర్న్), మూడో టి20 మ్యాచ్ జనవరి 31న (సిడ్నీ) జరుగుతాయి. ఫిబ్రవరి 2న తొలి వన్డే (కాన్బెర్రా), 5న రెండో వన్డే, 7న మూడో వన్డే (హోబర్ట్) జరుగుతాయి. భారత జట్టు...మిథాలీ రాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి (వైస్ కెప్టెన్), స్మృతి మంధన, తిరుష్ కామిని, హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, నిరంజన, సుష్మా వర్మ, రావి కల్పన, ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ రౌత్, పూనమ్ యాదవ్, స్నేహ రాణే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Cricket  Women cricket Team  Women Cricket Tourney  Australia series  

Other Articles