Hashim Amla resigns as South Africa captain

Hashim amla resigns as south africa captain

Hashim Amla , South Africa captain, Hashim Amla resigns, Cricket, Hashim Amla resigns to captaincy

The 32-year-old had been in poor form but made a double century to inspire his side's fightback after England made 629-6 declared in Cape Town."I believe I can be of greater value as a fully focused batsman and senior player at this time," said Amla. AB de Villiers will lead South Africa in the third Test in Johannesburg, which starts on 14 January

కెప్లిన్సీకి హషీమ్ ఆమ్లా రాజీనామా

Posted: 01/07/2016 03:24 PM IST
Hashim amla resigns as south africa captain

భారత గడ్డపై ఘోర పరాజయం. హోంగ్రౌండ్ లోనూ పరాభవమే. ఫలితం కెప్టెన్సీపై పడింది. సౌతాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ హషీమ్ ఆమ్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాదాపు ఏడాదిన్నర పాటు దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా హషీమ్ ఆమ్లా ఉన్నాడు. ఇంగ్లండ్ తో ముగిసిన రెండో టెస్టు తర్వాత ఆమ్లా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక పూర్తిగా బ్యాటింగ్ పై మరింత దృష్టి పెడతానని ఆమ్లా చెప్పాడు. గత ఏడాది కాలంగా ఫాం లేమితో సతమతమవుతున్న హషీమ్ ఆమ్లా, జట్టు పగ్గాలు డివిలియర్స్ కు అప్పగించాడు.

హషీమ్ ఆమ్లా మొత్తం 14 టెస్టులకు సారథ్యం వహించాడు. ఇందులో నాలుగింటిలో విజయం సొంతం చేసుకోగా, ఆరు టెస్టుల్లో పరాజయం పాలైంది. వీటిలో మూడు టెస్టుల్లో టీమిండియా చేతిలో ఘోరపరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ తో తొలి టెస్టులో ఓటమి పాలైన సంగతి కూడా తెలిసిందే. తన నిర్ణయాలపై విమర్శలు రావడంతో ఆమ్లా ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలోనూ తొలి టెస్టులో ఘోరంగా ఓడింది. రెండో టెస్టులో తన డబుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నా... కెప్టెన్సీకి మాత్రం ఆమ్లా గుడ్ బై చెప్పాడు. ఈ సిరీస్ లో అతని వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles