Ashwin Ends 2015 as No.1 Ranked Test Bowler

Ashwin steve smith end 2015 as world no 1s

ashwin, r ashwin, ravichandran ashwin, r ashwin rankings, steve smith rankings, ashwin smith rankings, Virat Kohli,Shane Warne,Muttiah Muralitharan,Kumar Sangakkara icc rankings, rankings cricket, cricket news

Ravichandran Ashwin and Steve Smith were No.1-ranked batsman and bowler at the end of 2015.

42 ఏళ్ల తరువాత ఆ రికార్డును అందుకున్న అశ్విన్

Posted: 12/31/2015 07:32 PM IST
Ashwin steve smith end 2015 as world no 1s

భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  42 ఏళ్ల తరువాత టెస్టుల్లో తొలిసారి అశ్విన్ అగ్రస్థానం కైవసం చేసుకుని రెండో భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అశ్విన్ టాప్ కు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ను వెనక్కునెట్టిన అశ్విన్..  బిషన్ సింగ్ బేడీ తరువాత అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న రెండో భారత బౌలర్ గా  నిలిచాడు. 1973లో  బిషన్ సింగ్  బేడీ అగ్రస్థానం సాధించిన తొలి బౌలర్ గా గుర్తింపు సాధించాడు. ఆ తరువాత ఇంతకాలానికి అశ్విన్ ఆ మైలురాయిని చేరుకుని  ఈ ఏడాదిని నంబర్ వన్ స్థానంతో ముగించాడు.

ఇదిలా ఉండగా ఆరోసారి అగ్రస్థానంలోనే సంవత్సరాన్ని పూర్తి చేద్దామనుకున్న స్టెయిన్ కు నిరాశే ఎదురైంది. 2009 నుంచి స్టెయిన్ టాప్ పొజిషన్లోనే కొనసాగుతుండగా ఈ ఏడాది మాత్రం ఆ ఘనతను సాధించడం సాధ్యం కాలేదు. ఇంగ్లండ్ తో  డర్బన్ లో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్ లో  నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న స్టెయిన్ .. అగ్రస్థానంలోనే నిలిచే పాయింట్లను మాత్రం సాధించలేకపోయాడు.  దీంతో రెండో ర్యాంకులో ఉన్న అశ్విన్ 871 పాయింట్లతో తొలిస్థానానికి ఎగబాకగా, డేల్ స్టెయిన్ 867 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.  ఈ ఏడాది అశ్విన్ తన ఖాతాలో 67 టెస్టు వికెట్లను సాధించాడు. కాగా, ఆల్ రౌండర్ల విభాగంలో కూడా అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో భారత బౌలర్లలో కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు తమ కెరీర్ లో రెండో ర్యాంకుకు చేరినా.. అగ్రస్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోవడం గమనార్హం

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Shane Warne  Ravichandran Ashwin  Muttiah Muralitharan  Kumar Sangakkara  

Other Articles