Chris Gayle discoverd new record on T20 Sixes

Chris gayle discoverd new record on t20 sixes

Chris Gayle, Chris Gayle Record, T20, Chris Gayle Sixes, Chris Gayle updates, International cricket, cricket, Westindies

Chris Gayle discoverd new record on T20 Sixes. Westindies player Chris Gayle discover new record in T20 format. he hits 600 sixes in the T20 Farmat.

టి20లో క్రిస్ గేల్ రికార్డ్.. 600 సిక్సర్లతో టాప్

Posted: 12/19/2015 05:57 PM IST
Chris gayle discoverd new record on t20 sixes

క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ను ఎలా అయితే దేవుడిగా కొలుస్తామో.. అలా క్రిస్ గేల్ ను డెవిల్ తో పోలుస్తారు. భారీ పర్సనాలిటీతో అందరిని భయపెట్టడమే కాకుండా అదిరిపోయే ఆటతో ఎదుటి జట్టుకు చమటలు పట్టిస్తాడు. గంగ్నమ్ డ్యాన్స్ చేసి స్టేడియంలో అందిరిని ఊపేసిన క్రిస్ గేల్.. తన బ్యాట్ తో మైదానంలో వీరవిహంగం చేసేస్తాడు. అయితే తాజాగా క్రిస్ గేల్ ఓ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ఆటగాడు ఎవరైనా ఉంటే అది గేల్ మాత్రమేనని కచ్చితంగా చెప్పొచ్చు. పిచ్ లోకి అడుగుపెట్టాడంటే ఎడాపెడా బంతుల్ని బౌండరీలకు దాటించడం గేల్ కు బాగా తెలిసిన విద్య.

ట్వంటీ 20 లకు అతికినట్లు సరిపోయే గేల్ ఇదే ఫార్మెట్ లో 600 సిక్సర్ల మార్కును చేరాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఈ ఘనతను అందుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ తో జరిగిన మ్యాచ్ లో మెల్ బోర్న్ రినీగేడ్స్ తరపున ఆడుతున్న గేల్ రెండు సిక్సర్లు వేసి ట్వంటీ 20 ఫార్మెట్ లో 600 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. తాజాగా 227వ ట్వంటీ 20 ఆడుతున్న గేల్ ఫోర్ల సంఖ్య కూడా 653 కు పెరిగింది. ఈ మ్యాచ్ లో గేల్(23బీ 16 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు) దాటిగా ఆడే యత్నం చేసి పెవిలియన్ కు చేరాడు. కాగా, ఇప్పటివరకూ 45 అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన గేల్ ఖాతాలో 87 సిక్సర్లు ఉన్నాయి. మొత్తానికి క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles