kohli, dhawan, rahane launched t20 world cup trophy

T20 world cup trophy launched in mumbai

Virat Kohli, Shikhar Dhawan, Ajinkya Rahane, ICC T-20, mumbai, T20 World Cup trophy

Shikhar Dhawan, Virat Kohli and Ajinkya Rahane at the launch of T20 World Cup trophy in Mumbai on Friday

ఐసిసీ టీ20 ట్రోఫీని అవిష్కరించిన మన క్రికెటర్లు

Posted: 12/11/2015 06:06 PM IST
T20 world cup trophy launched in mumbai

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించనున్న ఐసీసీ ట్వంటీ 20 వరల్డ్ కప్ టోర్నమెంటులో భాగంగా ముంబైలో ఇవాళ ఐసీసీ, బిసిసిఐ, ప్రతినిధుల సమక్షంలో ట్రోఫీని ఆవిష్కరించారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు, శిఖర్ ధవన్, అజింక్యా రహానేలు వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసిసీ  టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన అనంతరం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

 తొలిసారి భారత్ వేదికగా జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించనున్నారు. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహిస్తుండగా, కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడతుండగా, పాకిస్థాన్-టీమిండియాల మ్యాచ్ మార్చి 19వ తేదీన ధర్మశాలలో జరుగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉండగా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Shikhar Dhawan  Ajinkya Rahane  ICC T-20  mumbai  

Other Articles