ICC announces schedule of T20 Cricket World Cup 2016

Icc announce 2016 world twenty20 schedule

ICC World Twenty20, ICC WT20, World T20 schedule, 2016 World T20, WT20, India vs Pakistan, West Indies, England,, 2016 cricket, World Twenty20 schedule, fixtures

The ICC on Friday unveiled the groups and schedule of the event, which will be staged across eight venues in India from 8 March to 3 April.

ఐసీసీ 2016 వరల్డ్ కప్ షెడ్యూలు, వేదికలు ఖరారు..

Posted: 12/11/2015 06:17 PM IST
Icc announce 2016 world twenty20 schedule

ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. క్రికెట్ అభిమానులకు పోట్టి క్రికెట్ ఫార్మెట్ లో విందు ఇవ్వడానికి ముహూర్తాన్ని ఖారారు చేసుకుని వచ్చేసింది. టీ-20 వరల్డ్ కప్-2016 క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. దీని ప్రకారం రెండు రౌండ్లలో మ్యాచ్ లు సాగుతాయి. గ్రూప్ ఎ, గ్రూప్ బీలలో ర్యాంకుల పరంగా నాలుగేసి చిన్న దేశాలకు స్థానమిచ్చిన ఐసీసీ, వీటి మధ్య పోటీలు జరిపి, రెండు దేశాలను 'సూపర్ 10' రౌండుకు ఎంపిక చేస్తుంది.

గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఒమన్ దేశాలుండగా, గ్రూప్-బీలో జింబాబ్వే, స్కాట్లాండ్, హాంకాంగ్, ఆఫ్గనిస్థాన్ దేశాలున్నాయి. ఒక్కో గ్రూప్ లో టాప్ లో నిలిచిన జట్టు సూపర్ 10కు అర్హత పొందుతుంది. ఇక సూపర్ 10 గ్రూప్-1లో శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ తో పాటు గ్రూప్ బీ విన్నర్, గ్రూప్-2లో ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో పాటు గ్రూప్ ఏ విన్నర్ ఉంటాయి. ఈ పోటీల అనంతరం గ్రూప్ దశలో టాప్-2 స్థానాలు పొందే రెండు జట్లూ సెమీఫైనల్స్ కు అర్హత పొందుతాయి.

ఐసీసీ, బీసీసీఐ ప్రతినిధులు టోర్నమెంట్ డ్రాను ఇవాళ విడుదల చేశారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకూ పోటీలు సాగుతాయి. ముంబై, న్యూఢిల్లీల్లో సెమీఫైనల్స్, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ పోటీలు జరుగుతాయి. మొత్తం 58 మ్యాచ్ లు సాగనుండగా, అందులో 27 పోటీలు డే మ్యాచ్ లు. మహిళా టీ-20 పోటీలకు సంబంధించి 23 మ్యాచ్ లు జరుగనున్నాయి. మార్చి 19న దాయాదుల మధ్య పోరు జరుగనుంది. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

వచ్చే సంవత్సరం మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న టీ-20, 2016 షెడ్యూల్ లో భాగంగా ఇండియా ఆడే మ్యాచ్ లివే..

1. మంగళవారం, మార్చి 15 - ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (నాగపూర్)
2. శనివారం, మార్చి 19 - ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (ధర్మశాల)
3. బుధవారం, మార్చి 23 - ఇండియా వర్సెస్ ఏ గ్రూప్ క్వాలిఫయర్ (బెంగళూరు)
4. ఆదివారం, 27 మార్చి - ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (మొహాలి)

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  pakistan  schedule and fixtures  icc t-20 world cup  

Other Articles