Rahane century enables India to set target of 481

Ajinkya rahane joins virat kohli rahul dravid in elite club of centurions

India vs south africa,Live Streaming Information,virat kohli,ajinkya rahane,Rahul Dravid,Sunil Manohar Gavaskar,Ajinkya Rahane,South Africa in India Series, 2015,Cricket,4th test,Watch live,India vs south africa live score,Ind vs SA,4th test live,Day 4 live score,Ind vs sa live

Ajinkya Rahane scored a century in each innings of the fourth Test against South Africa at the Feroz Shah Kotla and in the process, he shattered several records.

రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలతో రహానే రికార్డు

Posted: 12/06/2015 07:04 PM IST
Ajinkya rahane joins virat kohli rahul dravid in elite club of centurions

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో అజింక్య రహానే మరో అద్బుతమైన శతకాన్ని నమోదు చేసి అరుదైన రికార్డు పొందాడు. ఒక టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ సాధించిన ఐదవ భారత క్రికెటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డును సునీల్ గవాస్కర్ 3 సార్లు, రాహుల్ ద్రవిడ్ రెండు సార్లు, విజయ్ హజారే, విరాట్ కోహ్లీలు ఒక్కోసారి సాధించి చూపారు. వారి జాబితాలో ఇప్పుడు అజింక్య రహానే కూడా వచ్చి చేరాడు. తొలి ఇన్నింగ్స్ తో పాటు రెండో ఇన్నింగ్స్ లోనూ శతకాలను నమోదు చేయడంతో ఆయన ఈ రికార్డు పోందాడు.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో రహానే 127 పరుగులు చేసిన సాధించాడు. కాగా రెండో ఇన్నింగ్స్ లో 206 బంతులాడి 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు కాగా, లీడ్ 480 పరుగులకు చేరింది. రహానే శతకాన్ని నమోదు చేయగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ను డిక్లెర్ చేశాడు. దీంతో టీమిండియా సఫారీలో ముందు 481 పరుగుల విజయలక్ష్యాన్ని వుంచింది. అంతకుముందు జరిగిన తొలిఇన్నింగ్స్ లో  180 బంతులాడిన రహానే 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  ajinkya rahane  ferozshah kotla stadium  delhi  

Other Articles