first in 18 years tea before supper during day night test

India played first ever day night test in first class cricket

Day night matches, India, Test Cricket, Ranji Trophy final, Gwallior, rupsing stadium, white ball, pink ball, day night match delhi mumbai, delhi, mumbai

india played first-ever day-night Test in first class cricket betweem mumbai and delhi ranji trophy match with white ball

పద్దెనిమిది ఏళ్ల క్రీతమే ‘ఆ’ ప్రయోగం

Posted: 11/27/2015 08:01 AM IST
India played first ever day night test in first class cricket

టెస్టు క్రికెట్‌లో డే నైట్ మ్యాచ్‌లు ఆడటంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. క్రికెట్ గురించి కాస్త పరిచయం ఉన్న వాళ్లలో ఎవర్ని కదిలించినా దీని గురించి కాస్త వింతగానో, ఆశ్చర్యంగానో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని భారత్ ఇంతకు ముందే ప్రయోగించింది అంటే నమ్మగలరా..? కానీ ఇది నిజం. 138 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి డే నైట్ టెస్టుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ (27న)తో రంగం సిద్ధం కావడంతో ఆందరూ ఆ మ్యాచ్ కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే 18 ఏళ్ల కిందటే భారత్‌లో డే నైట్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ జరిగిందని చాలా మందికి తెలియకపోవచ్చు. 1997 ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ను డే నైట్‌గా నిర్వహించారు.

గ్వాలియర్‌లోని రూప్‌సింగ్ స్టేడియం ఈ అరుదైన ప్రయోగానికి వేదికగా నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచ్ మధ్య ఒక్క తేడా మాత్రం ఉంది. అదే బాల్. మన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తెల్లబంతి వాడగా, ఆసీస్, కివీస్ టెస్టుకు మాత్రం ప్రత్యేకంగా రూపొందించిన గులాబి (పింక్) బంతిని ఉపయోగిస్తున్నారు. మామూలుగా టెస్టు మ్యాచ్‌లో లంచ్‌తో తొలి విరామం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యింది. లంచ్ తర్వాత ఆట మొదలై టీకి 20 నిమిషాల పాటు తొలి బ్రేక్ ఇస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఇది 4 గంటలకు ఉంటుంది. డిన్నర్ బ్రేక్‌గా పిలవబడే ‘సూపర్ బ్రేక్’ గం.6.20 మొదలై 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇక 7 గంటలకు మొదలయ్యే చివరి సెషన్ పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో 9 గంటల వరకు కొనసాగుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Day night matches  India  Test Cricket  Ranji Trophy final  

Other Articles