Jos Buttler breaks record as England beat Pakistan to win series

Buttler s fastest ton steers england to series win

pakistan, england, pak vs eng, eng vs pak, pakistan vs england, england vs pakistan, pakistan cricket, cricket pakistan, jos buttler, buttler, england, pakistan, one-day series, dubai, cricket news, cricket

England piled up 355/5 thanks to Jason Roy's maiden ODI hundred and Jos Buttler's magnificent 116 not out off 52 balls.

పాక్ పై వన్డే సిరీస్ ఇంగ్లాండ్ వశం

Posted: 11/21/2015 06:25 PM IST
Buttler s fastest ton steers england to series win

పాకిస్థాన్ తో జరిగిన నాలుగు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. చివరి వన్డేలో భాగంగా జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుని సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకుంది. ఇంగ్లండ్ విసిరిన 356 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్థాన్ 40.4 ఓవర్లలో 271 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ అజార్ అలీ(44) ఫర్వాలేదనిపించగా, షోయబ్ మాలిక్(52), బాబర్ అజామ్(51) హాఫ్ సెంచరీలు చేశారు.

ఆ తరువాత ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోవడంతో పాక్ కు ఘోర ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషిద్ తలో మూడు వికెట్లు తీయగా, డేవిడ్ విల్లేకు రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ ( 102) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. జో రూట్ (71 బంతుల్లో 71; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించాడు. రాయ్ -రూట్ ల జోడి రెండో వికెట్‌కు 140 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాదులు వేశారు.

రూట్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జాస్ బట్లర్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. జాస్ బట్లర్ (52 బంతుల్లో 116 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆ దేశం తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇంగ్లండ్ తరఫున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, ఓవరాల్‌గా ఆరోది. గతంలో ఇంగ్లండ్ తరఫున చేసిన రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు కూడా బట్లర్ నమోదు చేసినవే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  pakistan  Jos Buttler  one-day series  dubai  

Other Articles