finally cricketer yuvraj singh confirmed his marriage with actress and model hazel keech | yuvraj singh with hazel keech | indian cricketers

Yuvraj singh official announcement on his marriage with hazel keech

yuvraj singh, hazel keech, yuvraj singh with hazel keech, yuvraj singh controversy, yuvraj singh marriage news, yuvraj singh updates, yuvraj singh affairs, hazel keech news, hazel keech hot photos, hazel keech marriage news, hazel keech movies, yograj singh

yuvraj singh official announcement on his marriage with hazel keech : finally cricketer yuvraj singh confirmed his marriage with actress and model hazel keech.

అవును.. మేం పెళ్ళి చేసుకుంటున్నాం!

Posted: 11/16/2015 10:35 AM IST
Yuvraj singh official announcement on his marriage with hazel keech

కాబోతున్నట్లు స్వయంగా తెలిపాడు. ఇటీవల ఆమెతో జరిగిన తన నిశ్చితార్థం విషయాన్ని ఖరారు చేశాడు. త్వరలోనే ఆమెతో పెళ్ళి చేసుకోనున్నట్లు వివరించాడు. ‘అవును, మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. హాజెల్ రూపంలో నా జీవిత కాల స్నేహితురాలిని పొందాను. అంతా తన పోలికే అని అమ్మ కూడా చెప్పింది’ అని యువీ ట్వీట్ చేశాడు.

ఇటీవల ఇండోనేసియాలోని బాలిలో వీరిద్దరి మధ్య నిశ్చితార్థం జరిగినట్లు ఫొటోలు, వార్తలు మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇలా వార్తలు రావడంపై స్పందించిన యువీ.. మీడియాపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ‘నా పెళ్లి ఫిక్స్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పనిలోపనిగా పెళ్లి తేదీ ఎప్పుడన్న విషయం చెబితే ఇంకా బాగుంటుంది’ అంటూ అప్పుడు పేర్కొన్నాడు. అంతెందుకు.. తనకు అసలు హాజెల్ కీచ్ ఎవరో కూడా తెలియదన్నట్లుగా బాగానే నటించాడు. ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు, వివాహం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనంటూ ఆమధ్య ఖండించాడు. కానీ.. చివరికి వీరి నిశ్చితార్థం వ్యవహారం బయటికి రావడంతో తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. అయితే.. యువీ ఎందుకు ఇలా చేశాడన్నది మాత్రం ఇంకా అర్థం కావడం లేదు. ఏదైతేనేం.. ఫైనల్ గా తన పెళ్లి విషయాన్ని యువీ స్వయంగా నిర్ధారించాడు కాబట్టి ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు.

మరోవైపు.. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కూడా అతని పెళ్లి విషయాన్ని నిర్ధారించారు. ఇప్పటికే హాజెల్ కీచ్ కుటుంబసభ్యులతో వారు పెళ్లి విషయమై సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. అటు.. యువీకి నిశ్చితార్థం జరిగిన విషయాన్ని తెలుసుకున్న తోటి క్రికెటర్స్.. ఇతనికి కంగ్రాట్స్ అంటూ గ్రీటింగ్స్ పంపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ప్రియురాలు, నటి గీతాబస్రాని వివాహం చేసుకున్న హర్భజన్ సింగ్ అయితే చాలా ప్రత్యేకంగా యువీకి గ్రీటింగ్స్ పంపినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh marriage  hazel keech marriage  yograj singh updates  

Other Articles