shoaib akhtar requests sachin to stage all stars event in pakistan

Akhtar requests sachin to stage all stars event in pakistan

Sachin's Blasters vs Warne's Warriors,Cricket all stars score, Shoaib Akhtar, pakistan, 2nd t20 score,Sachin's blasters vs warne's warriors live,Cricket all stars live score,Kumar Sangakkara,Matthew Hayden,Jacques kallis,Sachin tendulkar,Brian lara,Shaun pollock,Saqlain Mushtaq, Minute Maid Park, Houston

Former speedster Shoaib Akhtar has requested Indian batting legend Sachin Tendulkar to hold the All-Stars Cricket event in Pakistan as well.

పాకిస్థాన్ లో అల్ స్టార్స్ టీ-20 లీగ్..

Posted: 11/12/2015 03:04 PM IST
Akhtar requests sachin to stage all stars event in pakistan

క్రీడాకారులకు, కళాకారులకు ఎల్లలు లేవని అనేక మంది తమ అభిప్రాయాలను వెళ్లడిస్తున్న క్రమంలో.. ఎలాంటి బేషజాలకు పోకుండా మాటల తూటాలను పేల్చకుండా, తాను తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోనే వ్యక్తం చేస్తున్నాడు భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన క్రికెట్ స్టార్స్ తో కలసి ఏర్పాటు చేసిన అల్ స్టార్స్ క్రికెట్ లీగ్ ను పాకిస్థాన్ లో ఆడేందుకు సచిన్ సుముఖత వ్యక్తం చేశాడు.

ఓ వైపు సరిహద్దులో కాల్పుల విరమణకు పాల్పడుతున్న పాకిస్థాన్ ద్వందనీతిని ఎండగడుతూ.. టీమిండియా పాక్ తో జరాగాల్సిన సిరీస్ లను రద్దు చేసుకునే దిశగా పూనుకుంటున్న తరుణంలో సచిన్ టెండుల్కర్ సహాసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ఆల్ స్టార్ టి20 మ్యాచ్ ను పాకిస్థాన్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. తమ దేశంలోనూ అల్ స్టార్ క్రికెట్ మ్యాచ్ లను  నిర్వహించాలని సచిన్ ను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కోరడంతో ఆయన ఈ మేరకు అంగీకారం తెలిపారు.

తన ప్రతిపాదనకు సచిన్ సంతోషంగా అంగీకరించాడని, ఇది కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడని అక్తర్ వెల్లడించాడు. మాజీ క్రికెటర్లతో సచిన్, షేన్ వార్న్ ఆల్ స్టార్ టి20 నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ న్యూయార్క్ లో నిర్వహించారు. రెండో మ్యాచ్ గురువారం హూస్టన్ లో జరుగుతోంది. అక్తర్ తో పాటు వసీం అక్రమ్, సక్లెయిన్ ముస్తక్, మెయిన్ ఖాన్ కూడా ఆల్ స్టార్ సిరీస్ లో ఆడుతున్నారు. భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అజిత్ అగార్కర్ కూడా ఇందులో ఉన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Shoaib Akhtar  All-Stars T20 Series  

Other Articles