msk prasad replaces roger binny as national selector | ravi shastri ousted from ipl gc | shashank manohar bcci

Msk prasad replaces roger binny as national selector ravi shastri ousted from ipl gc

msk prasad, msk prasad national selector, ravi shastri, roger binny, shashank manohar, srinivasan, bcci annual meeting, indian former cricketers, anil kumble, sourav ganguly

msk prasad replaces roger binny as national selector ravi shastri ousted from ipl gc : former india all rounder roger binny was removed as senior selector and replaced with former wicketkeeper-batsman msk prasad.

రవిశాస్త్రి, బిన్నీలకు బీసీసీఐ షాక్.. తెలుగు తేజానికి వరం..

Posted: 11/09/2015 04:48 PM IST
Msk prasad replaces roger binny as national selector ravi shastri ousted from ipl gc

ఇప్పటికే ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్ ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. రవిశాస్త్రి, రోజర్ బిన్నీలకు కూడా షాకిచ్చంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రిని తప్పించడమే కాకుండా టీమిండియా సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న రోజర్ బిన్నీని ఆ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే.. వీరిద్దరినీ సదరు పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాల వెనుకగల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక ఇదే సమయంలో తెలుగుతేజం ఎమ్మెస్కే ప్రసాద్ కు బీసీసీఐ ఓ వరాన్ని అందించింది.

తెలుగువాడైన మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు భారత జట్టు జాతీయ సెలక్టింగ్ కమిటీలో చోటు కల్పించింది. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. దీంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున అతడు ఆడాడు.

టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. గవర్నింగ్ సభ్యుల సంఖ్య 5కు కుదించారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ చైర్మన్ గా కొనసాగించాలని నిర్ణయించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లీ స్థానంలో గంగూలీని నియమించారు. విశాఖపట్నం, రాంచీ, ఇండోర్, పుణే, రాజ్ కోట్ స్టేడియాలను టెస్టు మ్యాచ్ లకు కొత్త వేదికలుగా ఎంపిక చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : msk prasad national selector  ravi shastri  roger binny  bcci  

Other Articles