ipl chairman rajeev shukla said bcci wants to host india-pakistan series in december | indo-pakistan decemeber series

Ipl chairman rajeev shukla positive comments on indo pakistan decemeber series

rajeev shukla, india pakistan series, indo pakistan december series, ipl chairman rajeev shukla, india vs pakistan matches, india vs pakistan, pakistan players, india players

ipl chairman rajeev shukla positive comments on indo-pakistan decemeber series : ndia and Pakistan have not played a bilateral series since 2012-13. The two countries, however, may play five ODIs and two T20Is in December, according to reports. BCCI will approach the government regarding the matter after Diwali.

ఎట్టకేలకు ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్ కి గ్రీన్ సిగ్నల్

Posted: 11/10/2015 05:43 PM IST
Ipl chairman rajeev shukla positive comments on indo pakistan decemeber series

నిన్నమొన్నటిదాకా వుండదనుకున్న ఇండో-పాక్ సిరీస్ ద్వైపాక్షిక సిరీస్ పై ఎట్టకేలకు ఓ సానుకూలమైన స్పందన వచ్చింది. ఎప్పటినుంచో ఈ సిరీస్ వుంటుందా..? వుండదా..? అన్న విషయాలపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. రెండుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఆ విధమైన రూమర్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సందర్భంలో అసలీ సిరీసే వుండదని అంతా అనుకున్నారు. అయితే.. ఇన్నాళ్లకు భారత్ కాస్త సానుకూలంగానే స్పందించింది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ను జరిపితేనే బావుంటుందని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

ఈ సిరీస్ పై మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన శుక్లా.. భారత్- పాకిస్థాన్ ల సిరీస్ జరగాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బలంగా కోరుకుంటుందన్నారు. కాగా, ద్వైపాక్షిక సిరీస్ ను యూఏఈలో కాకుండా భారత్ లో జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా.. ఈ సిరీస్ జరగడం ఖాయమేనని అనుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఇది సానుకూల మార్గంగానే కనిపిస్తోంది. అయితే.. భారత్ లో సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయంపైనే ప్రధానంగా ఆధారపడింది. ఒకవేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్ లో ఆడటానికి మొగ్గు చూపినా..  అక్కడి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

గత నెల్లో బీసీసీఐతో చర్చల్లో భాగంగా పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ భారత్ కు రావడంపై పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం లేనప్పుడు భారత్ కు ఎలా వెళతారని విదేశాంగ శాఖ షహర్యార్ ను ప్రశ్నించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు సిరీస్ పై ఆశలు పెట్టుకున్నా..  అంతిమంగా ప్రభుత్వ నిర్ణయం తరువాతే సిరీస్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ పై భారత్ ఆసక్తిగానే వున్నా.. పాక్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajeev shukla  india pakistan decemebr series  

Other Articles