Shoaib Akhtar thanks god saying "I'am in tendulkar's team"

I am done bowling to sachin tendulkar says shoaib akhtar

sachin tendulkar, sachin tendulkar india, india sachin tendulkar, shoaib akhtar pakistan, pakistan shoaib akhtar, sachin shoaib, Sachin tendulkar, Shane Warne, Cricket All-Stars league, Cricket All-Stars tournament, Brian Lara, Glenn McGrath, cricket news, cricket

Shoaib Akhtar said he wanted to be in Sachin Tendulkar's team and enjoy the series.

హమ్మయ్య..! నేను సచిన్ టీమ్ లోనే వున్నాను

Posted: 11/07/2015 04:21 PM IST
I am done bowling to sachin tendulkar says shoaib akhtar

క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు జీవితకాల ప్రత్యర్థిగా ఉన్న ప్రఖ్యాత మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అఖ్తర్ ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉన్నాడు. అదేంటి అని అనుకుంటున్నారా..? అంతర్జాతీయ క్రికెట్ లో తన కెరీర్ కొనసాగించనంత వరకు సచిన్ కు వ్యతిరేక జట్టులో వుంటూ. అతనికి బంతులు విసిరిన అక్తర్.. అమెరికాలో జరగనున్న 'క్రికెట్ ఆల్ స్టార్స్' సిరీస్ లో సచిన్ బ్లాస్టర్స్ జట్టులో స్థానం పొందడమే ఆయన ఆనందానికి కారణం. "గత 15 ఏళ్లుగా సచిన్ తో పోటీపడ్డా. నిజాయతీగా చెప్పాలంటే సచిన్ కు ఇక ఎంత మాత్రం బౌలింగ్ చేయలేను.

ఈ సిరీస్ లో సచిన్ కోసం నేను, నా కోసం సచిన్ ఒకే జట్టులో ఆడుతాం. సచిన్ తో కలసి ఆడబోతుండటం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. సచిన్ జట్టులోనే ఉండాలని ముందు నుంచి అనుకున్నా. అదే జరిగింది. థ్యాంక్ గాడ్" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సచిన్ ఒక విధ్వంసకర బ్యాట్స్ మెన్ అని, చరిత్రలో అతనికన్నా గొప్ప ఆటగాడు లేడని షోయబ్ ఆకాశానికి ఎత్తేశాడు. సచిన్ కు తాను బౌలింగ్ చేయడాన్ని అభిమానులు కోరుకుంటారని... అయితే, ఇప్పటికే ఆ పని చేసేశానని, ఇక చేయలేనని చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Shoib Akthar  Shane Warne  Cricket All Stars League  

Other Articles