WTA Finals: Sania Mirza-Martina Hingis enter 10th final of year

Sania mirza martina hingis enter wta finals title clash

sania mirza martina hingis, martina hingis sania mirza, sania mirza wta rankings, wta rankings sania mirza, tennis news, tennis

Sania Mirza-Martina Hingis had as many as eight titiles this year which speaks volumes of their success in 2015.

ఏడాదిలో పదో టైటిల్ సోంత చేసుకునేందుకు మరో అడుగు దూరంలో..

Posted: 10/31/2015 06:27 PM IST
Sania mirza martina hingis enter wta finals title clash

వరుస విజయాలతో దూసుకుపోతున్న మహిళల డబుల్స్ నెంబర్ వన్ గా నిలుస్తూన్న ఇండో స్విస్ జోడి సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ ఈ ఏడాది పదో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట  6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది. ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

నంబర్ వన్ ర్యాంకు పదిలం

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్  ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా..  వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ ఏడాది సానియా ఖాతాలో తొమ్మిదో  టైటిల్స్ చేరాయి. అందులో ఎనిమిది టైటిల్స్ (ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis  WTA Finals  Title clash  

Other Articles