match drawn between South Africa and Board President XI

Indian board president xi vs south africa day 2 warm up match

cricket, cricket news, india vs south africa 2015, kl rahul, shardul thakur, Indian Board President XI, Warm-up match, india vs south africa test series 2015, South Africa,India,South Africa in India Series, 2015,Cricket,Live Cricket Score,Live Blogs Board President's XI vs South Africa Highlights: Pujara, Rahul Stabilise Hosts After De Villiers Ton latest South Africa in India Series, 2015 news

Indian Board President XI (296, 92/0) vs South Africa (302) warm-up match ends in a draw.

సఫారీలతో డ్రా గా ముగిసిన వార్మ్ అప్ మ్యాచ్..

Posted: 10/31/2015 06:29 PM IST
Indian board president xi vs south africa day 2 warm up match

ఇప్పటికే టీ20, వన్డే మ్యాచ్ లను గెలుచుకుని జోరు మీదున్న దక్షిణాఫ్రికా- టెస్టు సిరీస్ పై గురిపెట్టింది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ అధిక్యాన్ని కనబర్చింది. ఇరు జట్ట మద్య జరిగిన వార్మ్ అప్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే  కావడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు.
 
డివిలియర్స్ కు తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54)  రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్ థాకూర్  నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49 నాటౌట్) ఆకట్టుకున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  cricket news  india vs south africa 2015  kl rahul  shardul thakur  

Other Articles