cricketer rahul comments create new sensation by praising virat kohli which dominating mahendra singh dhoni | virat kohli dhoni controversy

Cricketer rahul comments create sensation between kohli and dhoni on captaincy

cricketer rahul, kl rahul news, virat kohli news, mahendra singh dhoni, dhoni controversies dhoni updates, dhoni kohli controversies, dhoni news

cricketer rahul comments create sensation between kohli and dhoni on captaincy : cricketer rahul comments create new sensation by praising virat kohli which dominating mahendra singh dhoni.

ధోనీ కంటే విరాట్ బెటర్.. ఎందుకంటే?

Posted: 10/29/2015 04:08 PM IST
Cricketer rahul comments create sensation between kohli and dhoni on captaincy

టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య పోటీ బాగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తన కూల్ నేటివిటీతో ఏకంగా వరల్డ్ కప్ నే దేశానికి తీసుకొచ్చిన ధోనీ ఈమధ్య పేలవ పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుండటంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే.. వరుసగా టీమిండియా పరాజయాలపాలు కావడంతో కొందరు ప్రముఖులు సైతం అతనికి విరుద్ధంగా కామెంట్లు చేస్తున్నారు. అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు కూడా. ఇక రీసెంట్ గా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ఇండియా ఘోరంగా ఓటమి చవిచూడడంతో ధోనీపై విమర్శలు మరింత పెరిగిపోయాయి. ఇదే సమయంలో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం ప్రశంసల వెల్లువ వెల్లువెత్తుతోంది. ధోనీకంటే విరాట్ కోహ్లీయే ఎంతో బెస్ట్ అంటూ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ధోనిని డామినేట్ చేసినట్లు మరో యువ క్రికెటర్ విరాట్ కోహ్లీని పొగడడం హాట్ టాపిక్ గా మారింది.

భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి నాయకుడని టెస్ట్ ఓపెనర్ బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ అన్నాడు. విరాట్ అందరినీ ఒకే విధంగా చూస్తాడని చెప్పాడు. అతని ఆటతీరు తనకు చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆ యువ ఆటగాడు తెలిపాడు. తాను చేసిన రెండు టెస్ట్ సెంచరీలు విరాట్ నాన్స్ట్రయికర్గా ఉన్నప్పుడు చేసినవే అని గుర్తుచేసుకున్నాడు. అతడితో కలిసి ఆడుతున్నప్పుడు పరుగులు చేయడం చాలా సులువని, తనకు బాగా కలిసొచ్చిందన్నాడు. విరాట్ కోహ్లీ ఎంతో స్నేహపూర్వకంగా మెదులుతాడని, అతనిలాంటి కెప్టెన్ వుంటే ఒత్తిడికి గురికాకుండా ఫ్రెండ్లీగా మ్యాచ్ ఆడవచ్చునన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ విధంగా విరాట్ ను పొగుడుతూ రాహుల్ తన అభిప్రాయాల్ని వెల్లడించడంపై ధోనీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ధోనీ కారణంగానే టీమిండియాకు వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ తోపాటు విశ్వవ్యాప్తంగా జట్టుకు మంచి స్థానం కూడా దక్కిందని.. అటువంటి ధోనీని కాకుండా కుర్ర క్రికెటర్ విరాట్ ని పొగడడమేంటి? అంటూ మండిపడుతున్నారు.

అయినా.. విరాట్ పెర్ఫార్మెన్స్ కూడా గతకొద్దికాలంగా ఏమీ బాగోలేదని, ముఖ్యంగా వరల్డ్ కప్ సమయంలో విదేశీయుల ముందు తోకముడుచుకుని వచ్చేశాడని, అతనివల్ల జట్టుకు ఒరిగిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా.. నిత్యం అగ్గిమీద గుగ్గిలమైనట్టుగా కోపంతో రగిలిపోయే విరాట్ కంటే ధోనీయే చాలా కూల్ వుంటాడని చెబుతున్నారు. అంతేకాదు.. జట్టు ఓటమి అయినప్పుడు ఆ భారాన్ని తన మీదకే తీసుకుంటాడని, అలాంటి ధోనీ ఇండియాకు కెప్టెన్ గా వుండడం గర్వకారణమని అంటున్నారు. మొత్తానికి రాహుల్ చేసిన కామెంట్స్ మళ్లీ ధోనీ, విరాట్ ల మధ్య ‘కెప్టెన్’ చిచ్చు రేపినట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer kl rahul  virat kohli  mahendra singh dhoni  

Other Articles