preity zinta spoted with south africa cricketer david miller | preity zinta love affairs | david miller news

Preity zinta love affair with south africa cricketer david miller

preity zinta love affairs, preity zinta controversy, preity zinta with david miller, preity zinta updates

preity zinta love affair with south africa cricketer david miller : Bollywood actress Preity Zinta spoted with south africa cricketer david miller.

సౌతాఫ్రికా క్రికెటర్ తో ‘లవ్ ఎఫైర్’ సాగిస్తున్న బీ-టౌన్ నటి

Posted: 10/29/2015 04:07 PM IST
Preity zinta love affair with south africa cricketer david miller

కలల ప్రపంచాన్ని కళ్లకు అద్దినట్టు చూపేది ‘సినిమా’, అభిమానుల్ని ఉర్రూతలూగించేది ‘క్రికెట్’... ఈ రెండింటికి ఏమాత్రం సంబంధం లేకపోయినా అందులో వుండే సెలబ్రిటీలు వాటి మధ్య వున్న వ్యత్యాసాన్ని దూరం చేస్తున్నారు. సినీరంగంలో వున్నవారు తమ వ్యాపారలావాదేవీల కోసం క్రీడారంగంవైపు మొగ్గుచూపుతుంటే.. అటువైపున్నవారు తమ ఇమేజ్ ని రెట్టింపు చేసుకోవడం కోసం సినీరంగంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ప్రేమజంటలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ప్రేమ జంట చక్కర్లు కొడుతోందని సమాచారం. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఓ సౌతాఫ్రికా క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తల్ని నిజం చేసేలా వారిరువురు కలిసి రహస్యంగా తిరిగిన కొన్ని ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ వారిద్దరు ఎవరూ? అని తెలుసుకోవాలని ఆసక్తిగా వుందా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే.

ఆ బాలీవుడ్ టాప్ హీరోయిన్ మరెవ్వరో కాదు.. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. ఈమె అఫైర్లు నడపడం దిట్ట అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. ఈమె ఎక్కువ ఇమేజ్ సంపాదించింది ఆ ఎఫైర్లతోనే. ఇప్పటికే ఎంతోమంది హీరోలతో బహిరంగంగానే ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు.. పంజాబ్ జట్టు సహయజమాని నెస్ వాడియాతో గొడవ అయిన తర్వాత మళ్లీ ఎఫైర్లతో వార్తల్లోకెక్కింది. ఆ మధ్య యువరాజ్ తోనూ ఈమె ప్రేమాయణం నడిపిందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఇద్దరూ తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత అంతగా కనిపించకుండాపోయిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరో లవ్ ఎఫైర్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. అది కూడా దక్షిణాఫ్రికా క్రికెటర్ తో ఆమె లవ్ ఎఫైర్ నడుపుతుండటంతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ దక్షిణాఫ్రికా క్రికెటర్ మరెవ్వరో కాదు.. మైదానంలో పరుగుల వర్షం కురిపించే డేవిడ్ మిల్లర్. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా బాగానే చక్కర్లు కొడుతున్నారు. ఇద్దరూ రాసిపూపుకుని తిరగడం, క్లోజ్ గా మూవ్ అవడం బట్టి చూస్తుంటే.. ఇద్దరి మధ్య ఏదో సంబంధం మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పైగా.. వారిరువురు కూడా ఎవరికి తెలియకుండా చక్కర్లు కొడుతుండడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నాయి.

ప్రీతిజింతా సహయజమానికగా వ్యవహరిస్తున్న ఐపీఎల్లోని కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టులో మిల్లర్ కీలక ఆటగాడు. ఆ జట్టులో వేగంగా పరుగులు కొట్టే ఆటగాడు ఇతనొక్కడే వుండటంతో.. ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగిందని, అది ఇప్పుడు ప్రేమగా మారిందని అంటున్నారు. నిజానికి గతంలో ఈ తరహా వార్తలు రాగా ఆమె తోసిపుచ్చింది కానీ.. ఇప్పుడు మాత్రం సైలెంట్ గానే వుంటూ తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తోంది. మొత్తానికి ఈ జంట ఎఫైర్ ఎన్నాళ్లూ కొనసాగుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : preity zinta  david miller  

Other Articles