Amit Mishra available for 4th ODI, says Harbhajan Singh

India working on mixing singles with big shots harbhajan

amit mishra, amit mishra complaint, amit mishra fir, amit mishra assault, harbhajan singh, harbhajan singh india, india harbhajan singh, india vs south africa, ind vs sa, sa vs ind, cricket news, cricket

Harbhajan Singh said that the incident - police complaint and assault allegations ... on nature of the Chepauk track, senior off-spinner Harbhajan Singh has said.

సిరీస్ నిలబెట్టుకోవాలంటే.. గెలిచి తీరాల్సిందే..!

Posted: 10/21/2015 07:09 PM IST
India working on mixing singles with big shots harbhajan

దక్షిణాఫ్రికాతో తొలి మూడు వన్డేల్లో చేసిన ప్రదర్శన కంటే నాలుగో మ్యాచ్లో భారత బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరముందని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సిరీస్ విజయావకాశాలను కాపాడుకోవాలంటే చెన్నై మ్యాచ్ను టీమిండియా గెలవాల్సి ఉందని హర్బజన్ అన్నాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గురువారమిక్కడ నాలుగో వన్డే జరగనుంది. మ్యాచ్కు ముందు రోజు బుధవారం భజ్జీ మీడియాతో మాట్లాడుతూ.. సిరీస్ అవకాశాలు ఉండాలంటే చెన్నై మ్యాచ్లో భారత్ గెలవాలని అకాంక్షించారు.

విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా ఆడాల్సిన అవసరముందన్నారు. రెండో వన్డేలో మాదిరిగా మరింత మెరుగ్గా రాణిస్తామని భావిస్తున్నట్లు అశాభావం వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్లో పుంజుకుంటామని చెప్పాడు. గత మూడు మ్యాచ్ల్లో కంటే నాలుగో వన్డేలో బౌలర్లు మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు, బ్యాట్స్మెన్ కూడా గాడినపడాలన్నాడు. ఏ వికెట్పై అయినా పరుగులు చేసే సామర్థ్యం గల బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నారన్నారు. ఎన్నో మ్యాచ్ల్లో భారత్కు విజయాలు అందించిన విధంగానే.. రేపు జరగబోవు నాలుగో వన్డేలోనూ విజయం సాధించాలని, దీంతో పాటు సిరీస్ గెలిస్తే గొప్పగా ఉంటుందని హర్భజన్ అన్నాడు. కాగా అమిత్ మిశ్రా నాల్గవ వన్డే మ్యాచ్ కు అందుబాటులో వుంటాడని హర్భజన్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  indian cricket  south africa  4th odi  Harbhajan singh  

Other Articles