Virender Sehwag retires: Transcript of farewell message

Virendra sehwag announces retirement from icc and ipl

India,Virender Sehwag,Cricket Virender Sehwag Retires from International Cricket and Indian Premier League, ICC, IPL, Indian Cricketer, Virender Sehwag, Dashing Opener, Cricket Official sehwag announcement, latest Cricket news

Virender Sehwag has officially announced his retirement from international cricket. He is still playing first class cricket for Haryana

క్రికెట్ కు వీడ్కోలు పలికిన వీరేంద్రుడు..

Posted: 10/20/2015 06:44 PM IST
Virendra sehwag announces retirement from icc and ipl

టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ గా ఖ్యాతి గడించిన క్రికెటర్ వీరేంద్ర స్వేహాగ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.  అంతర్జాతీయ, దేశవాలి సహా ఐపీఎల్ క్రికెట్‌కు సెహ్వాగ్ వీడ్కోలు పలికారు. ట్విట్టర్ ద్వారా సేహ్వాగ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే టీమిండియా మరో దిగ్గజం సెహ్వాగ్ కూడా వీడ్కోలు పలికారు. నజఫ్‌గడ్ నవాబ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే వీరేంద్ర సెహ్వాగ్ ఆటను మనం ఇక అంతర్జాతీయ వేదికన చూడలేమని అభిమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేహ్వాగ్ క్రీజ్ లో వుంటే ప్రత్యర్థి బౌలర్లుకు ముచ్చమటలు పట్టేవి. ఆయన ఎంతటి బౌలర్ విసిరిన బంతులైనా సునాయాసంగా బౌండరీలకు తరలించడం మర్చపోలేమని అభిమానులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ టీ20 (ఎమ్‌సీఎల్)లో పాల్గొనేందుకే సెహ్వాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఎమ్‌సీఎల్‌లో మాజీ క్రికెటర్లకే ఆడే చాన్స్ ఉన్నందున్న సేహ్వాగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కంటికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న సేహ్వాగ్.. గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో క్రికెట్ లో రాణించలేకపోతున్నాడు.

అంతర్జాతీయ క్రికెటర్‌గా సెహ్వాగ్‌ది మహోజ్వలంగా 12 ఏళ్ల పాటు వెలుగొందారు. కెరీర్‌లో 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేసిన వీరూ 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కొట్టాడు. అలాగే 251 వన్డేల్లో 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు, 38 అర్ధ సెంచరీలున్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. భారత తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు సెహ్వాగే. అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన ఘనత (278 బంతుల్లో) కూడా తన పేరునే రాసుకున్నాడు సెహ్వాగ్‌. వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్ కూడా ఆయనే కావడం గమనార్హం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC  IPL  Indian Cricketer  Virender Sehwag  Dashing Opener  Cricket  

Other Articles