icc withdraws pakistan umpire aleem dar from india south africa matches

Withdrawn from india south africa series

cricket, team india, south africa, aleem dar, pakistan, shiv sena, south africa tour of india 2015, mumbai, chennai, bcci, pcb

The ICC today withdrew Pakistan umpire Aleem Dar from officiating in the remaining two matches of the ongoing one-day series between India and South Africa in the wake of Shiv Sena gheraoing BCCI chief Shashank Manohar forcing cancellation of talks with PCB chief Shaharyar Khan.

ఆ సిరీస్ లో పాక్ అంపైర్ ను తప్పించిన బిసిసిఐ

Posted: 10/20/2015 06:36 PM IST
Withdrawn from india south africa series

భారత్ - దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లలో షెడ్యూలు మేరకు విధులు నిర్వహిస్తున్న పాకిస్తాన్ అంపైర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి వెనక్కి తీసుకుంది. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఐసీసీ పాక్ అంపైర్‌ను వెనక్కి తీసుకుంది. భారత్ - పాక్ సిరీస్ కోసం బిసిసిఐ - పిసిబి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చర్చలు జరిపేందుకు సోమవారం ప్రయత్నించారు. దీంతో, ముంబైలోని బిసిసిఐ కార్యాలయానికి శివసేన వెళ్లి అడ్డుకుంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను నిలదీసింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా - భారత్ మ్యాచుల కోసం ఉన్న పాక్ అంపైర్‌ను ఐసీసీ వెనక్కి తీసుకుంది.

పాక్‌కు చెందిన అలిమ్ ధర్ ఐసీసీ ఎంపైర్ ప్యానెల్ మెంబర్. అతను తొలి మూడు వన్డేలకు ఉన్నాడు. ఈ నెల 22న చెన్నైలో జరిగే నాలుగో వన్డే, 25న ముంబైలో జరిగే ఐదో వన్డేకు కూడా షెడ్యూల్ ప్రకారం ఉన్నాడు. అయితే, ముంబైలో శివసేన బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి పిసిబితో చర్చలు అడ్డుకునే ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో పాక్‌కు చెందిన అలిమ్ ధర్‌ను వెనక్కి తీసుకుంది. కాగా, భారత్ - పాకిస్తాన్ సిరీస్ అంశంపై ఈ రోజు (మంగళవారంనాడు) ఢిల్లీలో చర్చలు జరిగే అవకాశముందని ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అలిమ్ ధర్‌ను వెనక్కి తీసుకొని, ఆయన స్థానంలో మరొక ఎంపైర్‌ను నిర్ణయిస్తామన్నారు.

అటు ముంబైలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆఖరి వన్డే పోరులో పాక్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత కామెంటేటర్లు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్‌లు కనిపించరు. వీరికి భద్రత కల్పించలేమని, అవాంఛిత ఘటనలు జరగవచ్చని భద్రతా అధికారులు చెప్పడంతో.. చెన్నైలో జరిగే నాలుగో వన్డే తర్వాత వీరిద్దరూ పాకగ్ పయనం కానున్నారు. ఈ విషయాన్ని అక్రం ఏజెంట్ ఆర్సలన్ హైడర్ స్పష్టం చేశారు. ముంబై వన్డేకు రెండు రోజుల ముందుగానే 23న వీరు పాకిస్థాన్‌కు పయనం కానున్నారని సమాచారం


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  aleem dar  pakistan  shiv sena  

Other Articles