Lou Vincent names Dinesh Mongia in match fixing revelation, says 'direct orders from Chris Cairns'

Was not involved in match fixing says dinesh mongia

ChrisCairns, Cricket, Cricket Controversies, ICL, Lalit Modi, LouVincent, MatchFixing, Dinesh Mongia, NZ, SpotFixing, Indian Cricket League (ICL)., disciplinary reasons, Chandigarh Lions

Former Indian player Dinesh Mongia has denied fixing allegations levelled against him by the former New Zealand batsman Lou Vincent during the unsanctioned and now defunct Indian Cricket League (ICL).

నేనెలాంటి ఫిక్సింగ్ లకు పాల్పడలేదు: దినేష్ మోంగియా

Posted: 10/13/2015 05:39 PM IST
Was not involved in match fixing says dinesh mongia

టీమిండియా మాజీ ఆటగాడు దినేశ్ మోంగియా ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ లూ విన్సెంట్ లండన్ కోర్టులో జరిగిన ఓ విచారణలో వెల్లడించాడు. తమ జట్టు మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ కోసం తనతో పాటు మోంగియా తదితరులు ఫిక్సింగ్ చేశామని విన్సెంట్ వెల్లడించాడు. తనను కెయిన్స్ ఈ ముగ్గులోకి దించాడని ఆరోపించిన విన్సెంట్, పోటీలు జరుగుతున్న సమయంలో ఓ ఇండియన్ తన వద్దకు వచ్చి ఫిక్సింగ్ ప్రతిపాదనతో వచ్చాడని తెలిపారు.

డబ్బులతో పాటు అందమైన యువతులను పంపుతానని ఆఫర్ చేయగా, విషయాన్ని కెయిన్స్‌కు చెప్పానని, కెయిన్స్ సైతం తనను ప్రోత్సహించాడని తెలిపాడు. కొంత మానసిక ఒత్తిడితో ఉన్న తాను వెంటనే ఆ గ్యాంగ్ లో చేరిపోయానని, మొత్తం నలుగురు సభ్యుల ఫిక్సింగ్ జట్టులో దినేష్ మోంగియా, న్యూజిలాండ్ ఫేస్ బౌలర్ డరైల్ టఫీ సభ్యులని విన్సెంట్ తెలిపాడు. అయితే విన్సెంట్ చేసిన ఆరోపణలను మోంగియా తీవ్రంగా ఖండించాడు. విన్సెంట్ చెప్పింది అబద్ధమని, తానెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. ఐసీఎల్ సమయంలో తాను చంఢీగఢ్ లయన్స్‌కు ఆడానని, జట్టులో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు కెయిన్స్, విన్సెంట్, తదితరలు ఏం చేశారో తనకు తెలియదని మోంగియా అన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dinesh Mongia  LouVincent  MatchFixing  SpotFixing  Indian Cricket League (ICL)  

Other Articles