Indian dressing room at Indore named after Rahul Dravid

Indore dressing room named after rahul dravid

cricket, team india in rahul dravid, india vs south africa, team india, virat kohli, rohit sharma, kolkar stadium, south africa tour of india 2015, ms dhoni, indore,

MS Dhoni and his men will be inspired by former India captain Rahul Dravid when they face South Africa in the 2nd ODI at the Holkar Stadium here tomorrow

రాహుల్ ద్రావిడ్ డ్రెసింగ్ రూమ్ లో టీమిండియా.. ప్రేరణ పోందాలని బిసిసిఐ అకాంక్ష

Posted: 10/13/2015 06:58 PM IST
Indore dressing room named after rahul dravid

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా అక్టోబర్ 14న (రేపు) రెండో వన్డేలో టీమిండియా, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న హోల్కర్ స్డేడియంలో జరగనున్నఈ మ్యాచ్ లో స్టేడియంలో టీమిండియా ఉపయోగించనున్న డ్రస్సింగ్ రూమ్ పేరు వింటే ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే హోల్కర్ స్డేడియంలో టీమిండియాకు కేటాయించిన డ్రెస్సింగ్ రూమ్ పేరు 'రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్'. వరుస పరాజయాలతో ఢీలా పడిన టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్‌ రూమ్ ద్వారా ప్రేరణ పొందనున్నారు.

రేపు జరగనున్న డే నైట్ మ్యాచ్ కోసం ఇండోర్ చేరుకున్న టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పైభాగాన ఉన్న బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ పేరుని చూసి, కొత్త ఉత్సాహంతో ఆడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 1996లో క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగులు సాధించారు. ఇందులో 48 సెంచరీలు(36 టెస్టులు, 12 వన్డేలు) ఉన్నాయి. భారత్ తరుపున 164 టెస్టు మ్యాచ్‌లు, 344 వన్డే మ్యా‌చ్‌లు, 1 ట్వంటీ మ్యాచ్ ఆడారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 42ఏళ్ల రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఇండియా ఏ జట్టు కోచ్‌గా ఉన్నారు. టీ-20 సిరీస్ ను చేజేతులా సౌత్ ఆప్రికాకు అప్పగించిన టీమిండియా.. ఇకనైనా వన్డే సిరీస్ లో నెగ్గి తమ సత్తాను చాటాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  team india  rahul dravid  south africa tour of india 2015  ms dhoni  indore  

Other Articles