T20 success raises South Africa's hopes ahead of India ODIs

It would be challenging to maintain momentum ab de villiers

challenging to maintain momentum, one day international, ravichandran ashwin, virat kohli, india vs south africa, washed out , Virat Kohli , Rohit Sharma , Ravichandran Ashwin , Kolkata , Hashim Amla, AB De Villiers, captain, India, south africa, team india, MS Dhoni, cricket news

AB de Villiers says it would be challenging to maintain the momentum against India.

టీమిండియాతో వన్డే సిరీస్ అతిపెద్ద ఛాలెంజ్

Posted: 10/10/2015 06:01 PM IST
It would be challenging to maintain momentum ab de villiers

టీమిండియాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి పూర్తి విశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా ఇకపై జరగనున్న వన్డే సిరీస్ పై కూడా అదే ప్రతిభను కనబర్చి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే సఫారీల జట్టు కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ మాత్రం టీమిండియాతో జరగనున్న అసలైన ఛాలెంజ్ వన్డేల రూపంలో ఉందని అభిప్రాయపడ్డాడు. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు. ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా మరింత కసిగా వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతుందనడంలోఎటువంటి సందేహం లేదని డివిలియర్స్ తెలిపాడు.

'ఒక గొప్ప సిరీస్ లో మాకు శుభారంభం లభించినందకు ఆనందంగా ఉంది. అదే ఆటతీరును వన్డేల్లో కూడా కొనసాగించడానికి పూర్తి స్థాయిలో యత్నిస్తాం. ఇప్పుడు మా ముందు వన్డే సిరీస్ రూపంలో అతి పెద్ద ఛాలెంజ్ ఉంది. వన్డే సిరీస్ ను కూడా గెలుస్తామని నమ్మకంగా ఉన్నాం. టీమిండియాతో జరుగుతున్న సిరీస్ లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. పలురకాలైన గ్రౌండ్లలో , వివిధ రకాలైన వికెట్లపై ఆడాలి. ఇప్పుడు అది కచ్చితంగా మాకు ఒక ఛాలెంజ్. భారత్ ను స్వదేశంలో కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతాం. సిరీస్ ను గెలవడమే మాకు ఇష్టం. టీమిండియా కూడా మమ్మల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుంది' అని డివిలియర్స్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AB De Villiers  captain  India  south africa  team india  MS Dhoni  cricket news  

Other Articles