Virat Kohli displaced as top T20I batsman; India fall to sixth place in ICC Rankings

Cc batting ranking virat kohli second in t20 third in odi

T20 Cricket,Indian Cricket,South Africa Cricket, India vs South Africa, Twenty20, Aaron Finch,MS Dhoni,Imran Tahir,Suresh Raina,Virat Kohli,Jean-Paul Duminy,Farhaan Behardien,Faf du Plessis,Aaron Finch,Cricket'

Virat Kohli lost the numero uno spot in Twenty20 International ranking to Australian Aaron Finch by nine points after a poor series against South Africa.

టీ20 ర్యాకింగ్స్: 6వ స్థానంలో భారత్.. కోహ్లీ టాప్ ర్యాంక్ గోవిందా..!

Posted: 10/10/2015 04:39 PM IST
Cc batting ranking virat kohli second in t20 third in odi

భారత్ పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికాను ఓడించి.. తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలనుకున్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. కేవలం టీ20 సీరీస్ లోని రెండు మ్యాచ్ లను చేజార్చుకుని సఫారీలకు సిరీస్ ను క్లీన్ స్వీప్ గా అందించిడంతో టీమిండియా టీ20 ర్యాంకుల్లో తన స్థానాన్ని దిగజార్చుకుంది. ప్రస్తుతం ఆరోవ స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఈడెన్ టీ20 మ్యాచ్ లో కూడా టీమిండియా ఓటమిని చవిచూసి వుంటే.. ఏకంగా 8వ స్థానానికి పడిపోయేది. అయితే అలా జరగకుండా నిజంగా వరుణుడే అడ్డుకున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో టాప్ ర్యాంకును కోల్పోయాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా టీమిండియా చెత్త ప్రదర్శనతో టైటిల్ ను చేజార్చుకుంది. డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడనుకున్న కోహ్లీ, ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్ లో మెరుగ్గానే రాణించినా, కటక్ లో జరిగిన రెండో టీ20లో సింగిల్ పరుగుకే వెనుదిరిగాడు. ఈ చెత్త ప్రదర్శన కారణంగానే చాలా కాలం నుంచి టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ దానిని చేజార్చుకున్నాడు

ఓ మెట్టు కిందకు జారిన కోహ్లీ ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. ధర్మశాల, కటక్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తమ జట్టు గెలుపుకు కారణమైన జేపి డుమిని ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి.. సురేష్ రైనాను పక్కకు జరిపి 11వ స్థానంలో కోనసాగుతున్నాడు. అటు హషీమ్ అమ్లా కూడా 22 స్థానం నుంచి 21వ స్థానాన్ని అందుకున్నాడు. ఏబీ డెవిలయర్స్ ఐదు స్థానాలు ఎగబాకీ 34వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో సఫారీ జట్టు ఓ స్థానం మెరుగుపరచుకుని ఐదో ర్యాంకుకు చేరింది. శ్రీలంక టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles