Kevin Pietersen Confirms With Video Message That He Will Participate In Pakistan Super League | PSL Controversy

Kevin pietersen confirms pakistan cricket league participation video message

Kevin Pietersen News, Kevin Pietersen Updates, Kevin Video Message, PSL, Pakistan League, IPL Season, PSL Season Updates, Indian cricketers, Pakistan Cricketers

Kevin Pietersen confirms pakistan cricket league participation video message : Kevin Pietersen Confirms With Video Message That He Will Participate In Pakistan Super League.

వీడియో తీసి మరీ సందేశాన్ని పంపాడు!

Posted: 09/21/2015 07:22 PM IST
Kevin pietersen confirms pakistan cricket league participation video message

ఏదైనా ఒక విషయంలో క్లారిటీ రావాలంటే.. అందుకు తగ్గ ఆధారాలు కచ్చితంగా వుండాల్సిందే! ఈ విషయాన్ని పసిగట్టిన ఇంగ్లండ్ డాషింగ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్.. దాన్ని తనదైన శైలిలో ఆచరణ చేసి చూపించాడు. త్వరలో యూఏఈలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆ ఇంగ్లండ్ ఆటగాడు పాల్గొంటాడా? లేదా? అని సందేహాలు గతకొన్నాళ్ల నుంచి చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కెవిన్ తాను కూడా ఆ లీగ్ లో పాల్గొంటానని స్పష్టం చేశాడు. అది కూడా తన వీడియో తీసి మరి తాను పాల్గొంటానని సందేశాన్ని పంపాడు.

తనకు లీగ్ లు ఆడటం కొత్తేమీకాదని.. ఇప్పటికే భారత్ లో జరిగే ఐపీఎల్లో అనేక మ్యాచ్ లు ఆడిన సంగతిని పీటర్సన్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నిర్వహించిన పీఎస్ఎల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఓ వీడియో సందేశాన్ని పీటర్సన్ పంపాడు. తాను పీఎస్ఎల్ కు కచ్చితంగా అందుబాటులో ఉంటానని పీటర్సన్ తెలియజేశాడు. ఈ పోటీల్లో పాల్గొనటానికి తాను ఎంతో ఆతృతగా ఉన్నానన్నాడు. అతి త్వరలో ఆరంభం కానున్న పాకిస్థాన్ ఈవెంట్ లో సందడి చేస్తానన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ తరువాత కరేబియన్ లీగ్ లో ఆడిన పీటరసన్.. నవంబర్ లో సౌతాఫ్రికాలో జరిగే రామ్ స్లామ్ ట్వంటీ 20 మ్యాచ్ ల్లో కూడా ఆడనున్నాడు.

ఇదిలావుండగా.. భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. దీంతో దీని తరహాలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా  పీఎస్ఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. దాదాపు 20 రోజులపాటు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. టోర్నీ మొత్తం మీద 24 మ్యాచ్ లు జరుగుతాయి. ఇక ఈ టోర్నీకి ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు)గా మాజీ క్రికెటర్లు వసీం అక్రం, రమీజ్ రాజాలు నియమితులయ్యారు.

క్రికెట్ను వెర్రిగా ప్రేమించే దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాత ఎక్కువ మంది అభిమానులున్నది పాకిస్థాన్లోనే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్థాన్ ఈ సూపర్ లీగ్ ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ పోటీలకు ఐపీఎల్ తరహాలో ఆదరణ లభిస్తుందా? లేదా? అనేది సందేహమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kevin Pietersen  Pakistan Super League  

Other Articles