Altercation At Cricket Match, Sept 12 2015

Cricket match turns violent

Jason Anderson, |George O'Brien, cricket match turns ugly, Cricket match turns violent, Clevaland County Cricket Club, Bermuda, 2015 Champion of Champions cricket match, Cleveland County Cricket Club, Willow Cuts Cricket Club, life-ban on Jason Anderson, O'Brien suspended for six matches, Anderson slapped O'Brien, O'Brien retaliated swinging bat, tussle and threw each other to the ground. altercation break out in club cricket match

A club cricket match in Bermuda turned ugly when two players got physically involved on the field. Jason Anderson, representing Cleveland County Cricket Club provoked Willow Cuts Cricket Club batsman George O'Brien, which resulted in a heated brawl in the centre of the pitch.

రణక్షేత్రం: మ్యాచ్ మధ్యలో చిన్నపిల్లల్లా పోట్లాడుకున్న క్రికెటర్లు..

Posted: 09/22/2015 06:38 PM IST
Cricket match turns violent

వాళ్లంతా పరిణితి చెందిన అటగాళ్లు.. స్లడ్జింగ్ కు కూడా అలవాటు పడినవాళ్లేనని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే వారిమధ్య జరుగుతున్న మ్యాచ్ అనూహ్యంగా రణక్షేత్రంగా మారిపోయింది. ఇద్దరు ప్రత్యర్థి జట్లకు చెందిన అటగాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అమెరికాలోని బర్ముడా ద్వీపంలో ఈ నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చాంఫియన్ ఆఫ్ ఛాంపియన్స్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా క్లీవ్ లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్, విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో క్లీవ్ లాండ్ కు చెందిన జసెన్ అండర్ సన్ విక్కెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు.

మ్యాచ్ మధ్యలో స్లెడ్జింగ్ జరగుతున్న క్రమంలో అన సహనాన్ని కోల్పోయిన అండర్ సన్.. పరుగెత్తుకుంటూ వచ్చి.. జార్జ్ ఓ బ్రెయిన్ ను వెనకనుంచి మెడపై కొట్టాడు. కోపంతో రగిలిపోయ ఒబ్రెయిన్ తన బ్యాట్ తో కొట్టబోయి అపాడు. అయినా శాంతించని అండర్ సన్ మళ్లీ గొడవకు దిగాడు, దీంతో ఓబ్రెయిన్ తన బ్యాటుతో కోట్టాడు. అయితే అది అండర్ సన్ కి తగల్లేదు. దీంతో ఇద్దరు ఒక్కరినోకరు నెట్టుకుంటూ చివరకు కిందపడ్డారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న టీమ్ సభ్యలు, అంపైర్లు మధ్యలో వచ్చి ఇద్దరిని శాంతింపజేశారు.  

అప్పటికే గ్రౌండ్ లోకి వచ్చిన క్రికెట్ క్లబ్ సభ్యులు, పోలీసులు వారిని చెరో వైపుకు తీసుకువెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. క్లీవ్ ల్యాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ ప్రెసిండెట్ కార్ల్ టన్ స్మిత్ అండర్ సన్ ను గ్రౌండ్ నుంచి పంపించివేశారు. అయితే ఘర్షణకు అజ్యం పోసిన అండర్ సన్ పై క్రమశిక్షణా చర్యల్లో బాగంగా జీవిత కాలం నిషేధాన్ని విధించగా, బ్యాట్ తో దాడి చేయబోయిన ఓబ్రెయిన్ ను కూడా ఆరు మ్యాచ్ లలో ఆడకుండా నిషేదాన్ని విధించారు. ఈ ఘటనకు ఎలా జరిగిందో చూడాలని వుందా ..? అయితే వీక్షించండి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles