Actress Radikaa’s daughter to get engaged to cricketer Abhimanyu Mithun

Abhimanyu mithun to marry actress radhikas daughter

abhimanyu mithun, radhikaa, rayane radikaa, ipl, royal challengers bangalore, rcb, rayane radikaa abhimanyu mithun, Veteran southern actress Radikaa, daughter Rayane Radikaa, Rayane will get engaged to Indian cricketer, Abhimanyu Mithun, traditional ceremony entertainment news

Actress Radikaa's daughter Rayane Radikaa will get engaged to IPL's RCB player Abhimanyu Mithun on September 23 in a traditional ceremony.

రాధిక ఇంటికి అల్లుడు కాబోతున్న క్రికెటర్ అభిమన్యు మిథున్

Posted: 09/11/2015 07:14 PM IST
Abhimanyu mithun to marry actress radhikas daughter

భారతదేశంలో క్రికెటర్లకు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు అవినాభావ సంబంధం చాలేనే వుందని చెప్పాలి. సెలబ్రిటీలుగా ఈ రెండు వర్గాల ప్రజలను ప్రజలు నిత్యం ఆరాధిస్తూనే వుంటారని కాబోలు ఈ అవినాభావసంబంధం మరింత ధృఢపడి మనుముందుకు దూసుకుపోతోంది. వివాహబంధంతోను ముడిపడింది. విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ ప్రేమాయణం ఒక్కటే కాదు అంతకు ముందు అనేక జంటలు ఈ రెండు వినోదపు విభాగం నుంచి ఒక్కటయ్యాయి. ఇప్పుడు తాజాగా రాధిక కూడా తన ఇంటికి క్రికెటర్ నే అల్లుడిగా తెచ్చుకుంటోంది.

నిన్నటితరం తరం మోస్ట్‌ పాపులర్‌ తారల్లో ఒకరైన రాధిక.. భారత క్రికెటర్‌కి అత్త కాబోతున్నారు. అవును,  రాధిక, శరత్ కుమార్ కుమార్తె రయానేకి.. టీమిండియా ఏ జట్టు సభ్యుడు, ఐపీఎల్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు క్రికెటర్‌ అభిమన్యు మిథున్‌తో వివాహం జరగబోతోంది. అమ్మా రాధికా అనుకోకండి.. ఎందుకంటే ఈ కార్యం కూడా కార్యరూపం దాల్సించి ప్రేమాయణంతోనే. రాధిక కూతురు రాయానే, అభిమన్యే మిధున్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ పెద్దలు చెప్పడం.. వారి వారి ఇళ్లలో ఒప్పించడం కూడా జరిగిపోయింది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా ఇరువురి పెద్దలు కూర్చోని వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ నెల 23వ తేదీ నిశ్చితార్ధం జరుగనుంది. ఆ రోజునే పెళ్లి తేదీ ఖరారు చేస్తారు. క్రికెటర్‌తో తన కూతురు వివాహాన్ని రాధిక ఖరారు చేశారు. రయానే పెళ్లి వేడుక కోసం ఆమె చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, రయాన్‌ లండన్‌లో లీడ్స్‌ విశ్వవిద్యాలయంలో ఎంఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ చదివింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abhimanyu mithun  rayane  radikaa  cricketer  veteran actress  indian team A  

Other Articles