Virat Kohli Gains More Twitter Followers Than Sachin Tendulkar | Mahendra Singh Dhoni

Virat kohli more twitter followers than sachin tendulkar

virat kohli news, sachin tendulkar updates, twitter updates, virat twitter followers, sachin twitter followers, sachin facebook followers, virat with sachin tendulkar, mahendra singh dhoni, dhoni latest controversies

Virat Kohli More Twitter Followers Than Sachin Tendulkar : Indian Test Cricket Captain Virat Kohli Got More Followers On Twitter Than Sachin Tendulkar.

కోహ్లీ ముందుకు.. సచిన్ వెనుకకు! ధోనీ ఎక్కడో?

Posted: 09/07/2015 04:34 PM IST
Virat kohli more twitter followers than sachin tendulkar

ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం అనుకూల వాతావరణం వీస్తున్నట్లు కనిపిస్తోంది. అనుష్కతో ప్రేమాయణం కొనసాగిస్తున్నప్పటి నుంచి ఇతని ఆటతీరులో లొసుగులు కనిపించడంతో తీవ్రస్థాయిలో విమర్వలు ఎదుర్కొన్నాడు. అనుష్కపై పెట్టిన దృష్టి క్రికెట్ లో పెట్టివుంటే వరల్డ్ కప్ ఇండియాదే అన్న అభిప్రాయాలు ఆమధ్య వినిపించాయి. అంతేకాదు.. మనోడికి కోపం ఎక్కువన్న విషయం తెలిసిందే! ఎవరో ఒక జర్నలిస్టు ఇంటర్వ్యూ తీసుకుందామని కోహ్లీ దగ్గరకు వస్తే.. మనోడు లాగి ఒక్కటివ్వడమే కాకుండా దురుసుగా మాట్లాడాడు. ఒకటా, రెండా.. ఇలాంటి వివాదాలు కోహ్లీ ఖాతాలో కోకొల్లలు. దీంతో ఇతడు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయాడు.

ఏదేమైనా.. ఆ వివాదాలతో గుణపాఠం నేర్చుకున్న కోహ్లీ ఇటీవల కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. తన ఆటతీరును కూడా చాలా మార్చుకున్నాడు. టీమిండియాకు వెన్నముకలా వుంటూ, తన కెప్టెన్సీని నిరూపించుకుంటున్నాడు. ఈ క్రమశిక్షణతోనే మొన్న శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ను గెలచుకురావడంలో తోడ్పడింది. ఆ గెలుపుతో కోహ్లీకి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే.. టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా వెనుకబడిపోయాడు. ఇక్కడ సచిన్ ను విరాట్ అధిగమించింది క్రికెట్ లో కాదులెండి.. ట్విటర్ లో! తమ అభిమానులకు నిత్యం ట్విటర్ ద్వారా చేరువలో వుండే వీరిద్దరికీ ఫాలోవర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. కానీ.. కోహ్లీ ఈ విషయంలో సచిన్ ని దాటేశాడు.

ఈ సామాజిక అనుసంధాన వేదికలో కోహ్లీని అనుసరిస్తున్న వారి సంఖ్య 80 లక్షలు దాటింది. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ కోమ్లీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. సచిన్ ను మాత్రం కేవలం 77 లక్షల మంది అనుసరిస్తున్నారు. నిజానికి నిన్నటివరకు సచిన్ మొదటి స్థానంలో వుండేవాడు కానీ.. కోహ్లీ హవా వీస్తున్నందున అతడికి ఫాలోవర్లు బాగానే పెరిగిపోయారు. ఇక ఇదే విషయంలో వన్డే కెప్టెన్ ధోనీ చాలా వెనుకే వున్నాడు. ట్విటర్ లో అతనిని అనుసరిస్తున్న వారి సంఖ్య కేవలం 40 లక్షలు మంది మాత్రమే. కానీ.. ఫేస్ బుక్ లో మాత్రం ఇప్పటికే సచిన్ దే హవా కొనసాగుతోంది. ఈ విషయంలో వారిద్దరు మాత్రం చాలా వెనుకే వున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  sachin tendulkar  mahendra singh dhoni  

Other Articles