Sachin Tendulkar's Mantra For a Disciplined Life: No Tobacco, No Alcohol

Never promoted tobacco or booze sachin tendulkar

Never Promoted Tobacco or Booze, Sachin Tendulkar, Sachin Ramesh Tendulkar,Cricket Sachin Tendulkar's Mantra For a Disciplined Life: No Tobacco, No Alcohol, Tobacco, Alcohol, advertisements, latest Cricket news

Sachin Tendulkar's mantra for a disciplined life was staying away from alcohol and tobacco.

నాన్నకు ఇచ్చిన మాటను ఎన్నడూ జవదాటలేదు

Posted: 09/06/2015 07:27 PM IST
Never promoted tobacco or booze sachin tendulkar

భారత క్రికెట్ దిగ్గజంగా గత మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సచిన్ టెండుల్కర్ తన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగినా.. గతంలో తండ్రికి ఇచ్చిన మాటను మాత్రం ఎన్నడూ జవదాటలేదని చెప్పుకోచ్చాడు. క్రికెట్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తాను తన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు. తన జీవితంలో మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చేయబోనని సచిన్ టెండూల్కర్ మరోసారి చెప్పారు.

‘మా నాన్న నా కెరీర్ ఆరంభంలోనే నాకు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఎప్పటికీ మద్యం, పొగాకు ఉత్పత్తుల కోసం ప్రచారం చేయనని ఆయనకు మాట ఇచ్చాను. అనేకసార్లు వీటికి సంబంధించి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు’ అని సచిన్ చెప్పారు. జీవితంలో ఎలాంటి కెరీర్ ఎంచుకున్నా సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే గొప్పవాళ్లుగా ఎదుగుతారని అన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  Tobacco  Alcohol  advertisements  

Other Articles