Ankit Keshri's family to receive insurance money from BCCI

Ankit keshris family to get rs 25 lakh as insurance compensation from bcci

cricket west bengal, Ankit keshri, west bengal, cricketer, BCCI, subheer ganguly, east bengal vs bhavanpuri, cricket news, cricket, 25 lakh insurance compensation, bcci,

Deceased Bengal U-19 captain Ankit Keshri's family will receive a compensation of Rs 25 lakh from BCCI's insurance company as the aforesaid amount has been cleared.

అంకిత్ కేసరీ కుటుంబానికి త్వరలో బీసీసీఐ పరిహారం

Posted: 09/05/2015 06:59 PM IST
Ankit keshris family to get rs 25 lakh as insurance compensation from bcci

క్రికెట్ ఆడుతూ మృతిచెందిన బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరీ కుటుంబానికి బీసీసీఐ పరిహారం అందనుంది. ఈ మేరకు న్యాయపరమైన వ్యవహారాలు పూర్తయినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అంకిత్ కు సంబంధించిన బీమా పరిహారపు చెక్ బీసీసీఐకి అందినట్లు సుబీర్ తెలిపాడు. బీమా పథకం నుంచి రూ.25 లక్షల పరిహారాన్ని త్వరలోనే అంకిత్ కేసరీ కుటుంబానికి అందించనున్నట్లు సుబీర్ తెలిపాడు. ఇందుకు సహకరించిన బీసీసీఐకి సుబీర్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు.

సాధారణంగా బిసిసిఐ పరిధిలోకి వచ్చే క్రికెటర్ క్రికెట్ ఆడుతూ మృతి చెందితే వారికి వర్తింప జేసే బీమా పరిహారం గరిష్టంగా రూ. 25 లక్షలని అదే పరిహారాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తామని సుబీర్ తెలిపారు.  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేసరీ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్ను ఢీకొట్టాడు. ఈ క్రమంతో తలకు బలమైన గాయంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కేసరి చివరకు ప్రాణాలను కోల్పోయాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ankit keshri  west bengal  cricketer  BCCI  subheer ganguly  

Other Articles