Cricket Stadium in Kerala to Be Named after India Legend SachinTendulkar

Kerala to name cricket stadium after sachin tendulkar

sachin tendulkar kerala,sachin tendulkar,Kerala Blasters,cricket stadium kerala sachin tendulkar,indian super league,kerala,run kerala run,Kerala Cricket Association, master blaster,God's own country, KCA president T.C. Mathew

If reports are to be believed, the master blaster is also set to own a luxury waterfront villa in the state as Kerala Cricket Association (KCA) is all set to name one of its stadiums after Him

కేరళ క్రికెట్ స్టేడియానికి సచిన్ టెండుల్కర్ పేరు..!

Posted: 09/04/2015 07:07 PM IST
Kerala to name cricket stadium after sachin tendulkar

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. నేటి తరం మేటీ క్రికెటర్లలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవాన్ని ఆయన పొందనున్నారు. కేరళలో నిర్మింతయమైన ఓ క్రికెట్ స్టేడియానికి సచిన్ పేరును పెట్టాలని ప్రతిపాదించించినట్లు సమాచారం. రమారమి ఆ ప్రతిపాదన అమోదం కూడా చెందిందని తెుస్తోంది. కేరళలోని జవహార్ లాల్ స్టేడియంలో ఒ పెవిలియన్ సచిన్ పేరున వుందని, అయితే ఆయన పేరున ఒక స్టేడియం లేనందున దానినే తాము ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు కేరళ క్రికెట్ అసోసియేషన్ టిసి మాథ్యూస్ తెలిపారు. అయితే ఏ స్టేడియానికి టెండుల్కర్ పేరును పెట్టాలన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

కేరళతో నూతనంగా నిర్మించిన వాయనాడ్ స్టేడయంతో పాటు మరికొన్ని స్టేడియలు పూర్తికావస్తున్న దశలో వున్నాయని మాథ్యూస్ తెలిపారు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ కేరళతో తన అనుబంధాన్ని మరింత దగ్గర చేసుకోనున్నాడు. ఐఎస్‌ఎల్‌లో కేరళ బ్లాస్టర్స్‌ జట్టుకు సహ యజమానిగా ఉన్న సచిన్‌.. కొచ్చిలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రకృతి అందాలకు ప్రసిద్ధి అయిన ఆ రాష్ట్రంలో వాటర్‌ఫ్రాంట్‌ విల్లా కోసం వెతుకుతున్నాడట! బ్యాక్‌వాటర్‌ నది పరివాహక ప్రాంతంలో (పనాగ్నాడ్‌)ని సుందరమైన ప్రదేశంలో నిర్మిస్తున్న ‘బ్లూ వాటర్స్‌ విల్లా’ను అతను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

దురలవాట్లను పారదోలేందుకు..: గ్రామీణ ప్రాంతాల ప్రజలను దురలవాట్ల నుంచి దూరం చేసే ఉద్దేశంతో కోయంబత్తూర్‌లో శుక్రవారం నిర్వహించే ‘గ్రామీణ పునర్‌ నవీనీకరణ’ శిబిరానికి సచిన్‌ స్టార్‌ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. మద్యం, ధూమపానం అలవాట్లను దూరం చేయడంతో పాటు వివిధ అంశాల్లో గ్రామస్థులు ఉమ్మడి నిర్ణయాలు తీసుకునేలా చేసేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. వీటిలో విజేతలకు మాస్టర్‌ బహుమతులు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles