Six-month rehabilitation program for three Pakistani cricketers

Disgraced trio allowed club cricket from september 2

islamabad, pakistan cricketers, pakistan Disgraced trio, rehabilitation, program, international cricket, five years ban on pakistan trio, pakistan cricket board, opening, batsman, salman butt, fast bowlers, mohammad asif, mohammad amir

Three Pakistan cricketers banned for spot fixing against England in 2010 will have to undergo a six-month rehabilitation programme before they can return to international cricket after their five-year ban ends on September 1.

ఆ పాక్ క్రికెటర్ల త్రయానికి 6 నెలల రిహాబిలిటేషన్..!

Posted: 08/27/2015 03:43 PM IST
Disgraced trio allowed club cricket from september 2

స్పాట్ ఫిక్సింగ్ కు అంగీకరించి అడ్డంగా దోరికిపోయిన పాకిస్థాన్ క్రికెట్ త్రయం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సందడి చేయనున్నారా? అంటే పీసీబీ పెద్దలు అవుననే అంటున్నారు. ఇంగ్లాండ్ తో ఐదేళ్ల క్రితం లార్డ్స్లో జరిగిన మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కోన్న ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్, మహ్మద్ అమీర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులొకి కొందరు పెద్దలు చకచకా పావులు కదుపుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ఉలిక్కిపడేలా చేసిన ఈ ముగ్గురిపై ఐదేళ్ల పాటు ఐసిసీ విధించిన నిషేధం సెప్టెంబర్ 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురని ఆరు మాసాల పాటు రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఆరుమాసాల పాటు వారు పాకిస్థాన్ క్లబ్ క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది. దీంతో మరో ఆరు మాసాల తరువాత ఈ ముగ్గురు ఫిట్ నెస్ నిరూపించుకున్న పక్షంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టనున్నారు.

2010లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడిన సందర్భంగా వీరి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఓ స్థానిక న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. అప్పటి వరకు మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే ఉంటుందని తెలిసిన అభిమానులకు స్పాట్ ఫిక్సింగ్ ను ఆసిఫ్, భట్, అమీర్ పరిచయం చేశారు. వీడియో పుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో వీరు ముగ్గురికి ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది. సెప్టెంబర్ 1తో వీరిపై నిషేధం ముగియనుండడంతో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పీసీబీ ఆ ముగ్గురినీ హెడ్ ఆఫీస్ కు పిలిపించుకుంది. లాహోర్ లోని హెడ్ ఆఫీస్ లో వారి అభిప్రాయాలు తెలుసుకున్న పీసీబీ, వారిని మళ్లీ క్రీజులోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rehabilitation program  salman butt  mohammad asif  mohammad amir  

Other Articles