India vs Sri Lanka, 2nd Test, Day 3: Mishra, Ashwin clean-up SL tail; India take 87-run lead.

Icc rankings kohli drops out of top 10 ashwin moves up

india, sri lanka, india vs sri lanka, ind vs sl, ashwin, Ravichandran ashwin, virat kohli, kohli, Amit mishra, all rounder, kumara sangakkara, Micheal clare, ajinkya rahane, icc test rankings, ICC rankings, India, Srilanka, dubai, cricket news, cricket

India's Test captain Virat Kohli has dropped out of ICC's top-10 list for batsmen in the five-day format, but R Ashwin's remarkable outing in the ongoing series pushed him to 8th rank.

ఐసిసి ర్యాకింగ్స్: టాప్ టెన్ నుంచి కోహ్లీ అవుట్.. అశ్విన్ ఇన్

Posted: 08/25/2015 07:06 PM IST
Icc rankings kohli drops out of top 10 ashwin moves up

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. తన నేతృత్వంలో తొలిసారిగా పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ను అడుతున్న క్రమంలో.. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టాప్ టెన్ నుంచి పడిపోయాడు.  తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 11వ స్థానం దక్కించుకున్నాడు. అస్ట్రేలియా కెప్టెన్ గా పగ్గాలను స్వీకరించనున్న స్టీవెన్ స్మిత్ ఐసిసి ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో 910 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అ తరువాత డి విలయర్స్, జో రూట్, హాషిమ్ అమ్లా, అజిలో మాధ్యూవ్స్, యూనిస్ ఖాన్, సంగక్కర, విలియమ్ సన్, డేవిడ్ వార్నర్, క్రిస్ రోజర్స్ లు టాప్ టెన్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు. అజింక్య రహానే 20 వ స్థానంలో, మురళీ విజయ్ 22వ స్థానంలో నిలిచారు.

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో విశేషంగా రాణించిన అశ్విన్ పైకి టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఎగబాకాడు. బౌలింగ్ లో అశ్విన్ 8వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ విభాగంలో 2వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో డేయిల్ స్టీన్ 905 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలువగా, 8వ స్థానంలో అశ్విన్, 9వ స్థానంలో రంగనా హెరత్ కొనసాగుతున్నారు. భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా అనూహ్యంగా 42  స్థానాలు ఎగబాకి 39వ ర్యాంకులో నిలిచాడు. కాగా బ్యాటింగ్ విభాగంలో టాప్ టెన్ లో భారత్ కు ప్రాతినిధ్యం లేకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  virat kohli  ashwin  amit mishra  ICC test rankings  

Other Articles