Virat Kohli Leads as Team India Enjoy Badminton, Tuk Tuk Rid

When virat harbhajan took autorickshaw sri lanka

india vs sri lanka, india tour of sri lanka, cricket, virat kohli, harbhajan singh, team india, autorickshaw, srilanka, india tour of sri lanka 2015, india sri lanka, india vs sri lanka 2nd test day three, ind vs sl, kl rahul, rahul, virat kohli, kohli, India, Srilanka, India vs srilanka, second test, colombo, cricket news, cricket

Team India seems to be relishing their win over Sri Lanka in the second Test match at Colombo.

లంకలో టీమిండియా పార్టీ మూడ్.. అటో నడిపిన భజ్జీ

Posted: 08/26/2015 06:01 PM IST
When virat harbhajan took autorickshaw sri lanka

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకకు చేరుకున్న టీమిండియా.. గాలేలో జరిగిన తొలి టెస్టును కొద్దిలో చేజార్చుకున్నా.. కొలంటొ వేదికగా జరిగిన రెండో టెస్టులో లంకేయులపై విజయం సాధించిన ఆనందంలో కోహ్లీ సేన భలే సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొలంబోలో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ విజయాన్ని అందుకున్న ఆనందంలో.. తన టీమేట్స్ తో కలసి కెప్టెన్ కోహ్లీ గెలుపును బాగానే అస్వాధిస్తున్నారు. మూడో టెస్టు ప్రాక్టీసుకు ముందు లభించిన ఒక రోజును ఆటగాళ్లు తమకు తోచిన విధంగా సంతోషంగా గడిపారు.

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్వయంగా ఆటోను నడుపుతూ జట్టు సహచరులతో కలిసి కొలంబో వీధుల్లో షికారు చేశారు. తన ఆటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టువర్ట్ బిన్నిని కూర్చోబెట్టుకుని షికార్లు చేశారు. ఇలా అటోను నడుపుతున్న క్రమంలో సహచర ఆటగాళ్లు క్లిక్ మనిపించిన ఈ ఫొటోను హర్భజన్‌.. తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ తరువాత తర్వాత భజ్జీ, భువనేశ్వర్‌, ఇషాంత్‌ శర్మ, ఛటేశ్వర్‌ పుజారాతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్‌ ఆడాడు. కాగా, ఆగస్టు 28 నుంచి శ్రీలంక-భారత్‌ మధ్య ఆఖరిదైన మూడో టెస్ట్‌ జరగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  virat kohli  harbhajan singh  team india  autorickshaw  srilanka  

Other Articles