Virender Sehwag to represent Haryana in upcoming domestic season

Sehwag leaves delhi play young exciting haryana

virender sehwag, sehwag, virender sehwag india, india virender sehwag, ranji trophy, haryana cricket team, haryana, virender sehwag haryana, sehwag india, ranji, ranji cricket, cricket news, cricket

Opening batsman Virender Sehwag will play for Haryana in this year's domestic season, it was announced today by Haryana Cricket Association's (HCA) secretary Anirudh Chaudhry

యంగ్ హర్యానాకు వీరేంద్ర సేహ్వాగ్ ప్రాతినిథ్యం

Posted: 08/23/2015 10:44 PM IST
Sehwag leaves delhi play young exciting haryana

గత కొంత కాలంగా ఫామ్‌లేమితో టీమిండియాకు దూరమైన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దేశవాళీలో తన సొంత జట్టు ఢిల్లీని వీడి హర్యానాకు మారాడు. దీంతో గత కొన్ని రోజులుగా సెహ్వాగ్ ఢిల్లీని వీడుతున్నాడన్న ఊహాగానాలకు ఎట్టకేలకు  తెరపడింది. రాబోయే దేశవాళీ సీజన్‌లో సత్తాచాటేందుకే ఈ 36ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ హర్యానా జట్టును ఎంచుకున్నట్లు తెలిసింది. 1997 నుంచి దేశవాళీలో ఢిల్లీ జట్టు తరుఫున 18 సీజన్లలో ప్రాతినిధ్యం వహించిన సెహ్వాగ్ గత కొన్ని రోజుల కిందటే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ నుంచి నిరంభ్యంతర సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) తీసుకున్నాడు.

కాగా, ప్రస్తుతం యువకులతో కూడిన హర్యానా జట్టు తరుఫున రాబోయే దేశవాళీ సీజన్‌లో బరిలోకి దిగడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘమైన అనుభవమున్న సెహ్వాగ్ తమ జట్టును ఎంచుకోవడం పట్ల హర్యానా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిరుధ్ చౌదరీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది ఇలా ఉండగా, మరో సీనియర్ క్రికెటర్ మిథున్ మన్హాస్ కూడా సెహ్వాగ్ బాటలోనే నడుస్తూ ఢిల్లీ జట్టుకు వీడ్కోలు పలికాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  virender sehwag  delhi  haryana  bcci  ranji trophy  

Other Articles