Cricketer Harbhajan Singh to marry actor Geeta Basra in October

Harbhajan singh to marry geeta basra in october

arbhajan Singh, hat-trick, Geeta Basra, cricket, engagement, marriage, love, jalandhar, forever, model-actor Geeta Basra, Bollywood, Cricket, harbhajan marriage with bollywood actor, bhajji marraige

Ace off-spinner Harbhajan Singh will tie the knot with his long-time girlfriend, model-actor Geeta Basra, in October

భజ్జీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు..!

Posted: 08/22/2015 05:57 PM IST
Harbhajan singh to marry geeta basra in october

భారత స్పిన్నర్ హర్భజన్‌సింగ్ తర్వలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ నటి గీతాబస్రాను అక్టోబర్‌లో భజ్జీ వివాహమాడనున్నాడు. పంజాబ్‌లోని జలంధర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫగ్వారాలో అక్టోబర్ 29న వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. బాలీవుడ్ నటి అయిన గీతాబస్రా, హర్భజన్ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని వారు ఎప్పుడూ బాహాటంగా ప్రకటించలేదు. ఇటీవల బస్రా తాజా చిత్రం సెకెండ్ హ్యాండ్ హజ్బండ్ ప్రమోషన్‌ టూర్‌లో బస్రా ఈ విషయంపై పెదవి విప్పింది.

తాను పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా ప్రకటిస్తానని, అంతేకానీ కామ్‌గా ఉండబోనని చెప్పింది. తాను పంజాబీ అమ్మాయినని, పంజాబీనే చేసుకుంటానని.. అది కూడా ధూమ్‌ధామ్‌గా పెళ్లాడతానని చెప్పి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పుడు తాజాగా మళ్లీ వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్‌లో ఉన్న హర్భజన్ ఇంటికి వచ్చాక వివాహ తేదీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు బంధువులు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harbhajan Singh  hat-trick  Geeta Basra  cricket  engagement  

Other Articles