Sri Lanka reach 140/3 on Day 2; trail India by 253 runs in 2nd Test

Sangakkara fails to convert start sri lanka 140 3

india vs sri lanka, india tour of sri lanka, india sri lanka, india vs sri lanka 2nd test day two, ind vs sl, kl rahul, rahul, virat kohli, kohli, India, Srilanka, India vs srilanka, second test, colombo, cricket news, cricket

India were bowled out for 393 in their first innings against Sri Lanka in the post-lunch session of the second day in the second cricket Test at the P. Sara Oval here on Friday.

కొలంబో టెస్టులో 253 పరుగులతో వెనుకబడ్డ లంక

Posted: 08/21/2015 07:30 PM IST
Sangakkara fails to convert start sri lanka 140 3

మూడు టెస్టుల సీరిస్ లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తడుబాటుకు గురవుతుంది. భోజన విరామ సమయం తరువాత బ్యాటింగ్ ఆరంభించిన లంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నస్టానికి 140 పరుగులు సాధించింది. కొలంబో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్న లంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర.. తొలి టెస్టులో మాదిరిగానే రెండో టెస్టులో కూడా రాణించలేక పోయాడు. ఈ టెస్టులో రాణించి.. శతకాన్ని నమోదు చేస్తాడని ఎదురుచూసిన అతని అభిమానుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. రెండో టెస్టు తొలిఇన్నింగ్స్ లో సంగక్కర స్వల్ప స్కోరుకే పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని అడిన సంగక్కర.. స్లిప్ లో వున్న రహానేకు క్యాచ్ ఇవ్వడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. బ్యాటింగ్ కు దిగన లంక అదిలోనే ఓపెనర్ దిముత్ కరుణరత్నే విక్కెట్ ను చేజార్చుకుంది. ఆ తరువాత మరో ఓపెనర్ సంగక్కరతో కలసి 51 పరుగులు సాధించాడు. అంతకు ముందు సంగక్కర 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిరుమణ్ణే 28 పరుగులతో వుండగా, కెప్టెన్ మాథ్యూస్ 19 పరుగులతో వున్నారు.

అంతకు ముందు భారత్ 394 పరుగులకు అటౌట్ అయ్యింది. తొలి రోజు ఆట ముగిసే సమాయానికి ఆరు వికెట్ల నష్టాలనికి 319 పరుగులను సాధించిన కోహ్లీ సేన.. రెండో రోజున 75 పరుగులను జోడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... రెండో రోజున లంచ్ విరామ సమయం తరువాత అలౌట్ అయ్యింది. రెండో రోజున బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సహా తనదైన శైలితో అర్థశతకాన్ని సాధించాడు. ఆరు వికెట్ల నష్టానికి 319 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలో దిగిన కోహ్లీ సేనలో వృద్దిమాన్ సహా 117 బంతులు ఎదుర్కోని ఆరు బౌండరీలతో 56 పరుగులు సాధించాడు. అశ్విన్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ కు చేరాడు, ఆ తరువాత వచ్చిన అమిత్ మిశ్రా సహాతో జతకట్టాడు. 24 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రా చమీరా బౌలింగ్ లో వెనుదిరిగాడు, ఆ తరువాత వచ్చిన ఇశాంత్ శర్మ, రెండు పరుగుల వ్యక్తిగత స్కోరుకే వెనుదిరగగా, ఉమేష్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో ధమ్మిక ప్రసాద్ రెండు, మ్యాధీవ్స్ రెంబు, చమీరా రెండు విక్కెట్లను సాధించగా, హెరాత్ నాలుగు వికెట్లను సాధించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Srilanka  India vs srilanka  second test  colombo  

Other Articles