Dhoni 'denigrated' Hindu god, stirs in controversy

Karnataka high court critical of ms dhoni for allegedly denigrating a god

Ms dhoni, karnataka high court, indian cricketer, denigrating a god case, Mahendra Singh Dhoni, India captain Dhoni, Hindu God, advertisements, Indian legal news, Law, Legal, Business news, Global news, Competition news, intellectual property news, IP news, BCCI news, law journals

India captain Mahendra Singh Dhoni found himself in hot water as a case was filed against him in the Karnataka High Court for “denigrating” a Hindu God in one of the advertisements that he was a part of.

ధోని పై కర్నాటక హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Posted: 08/12/2015 04:33 PM IST
Karnataka high court critical of ms dhoni for allegedly denigrating a god

ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో టీమిండియా టి-20, వన్డే జట్ల కెప్టెన్ ధోనీ తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఓ వాణిజ్య ప్రకటనలో ధోనీ హిందూ దేవుణ్ని అగౌరవపరిచాడంటూ ఆయనపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు విచారించింది. ఉన్నత న్యాయస్థానం ధోనీ తీరును ఆక్షేపించింది. ధోనీ వంటి సెలెబ్రిటీలు కేవలం డబ్బు కోసమే     యాడ్స్ చేస్తారు. వాటి పర్యవసానాల గురించి ఆలోచించరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యత లేకుండా యాడ్స్పై సంతకాలు చేస్తారే కాని.. వాటివల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించరని వ్యాఖ్యానించింది.

ధోని సహా సెలబ్రిటీల లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే అని కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎన్ వేణుగోపాల్ గౌడ పేర్కొన్నారు. షూలు ధరించి, చేతిలో పలు వస్తువులు పట్టుకుని, విష్ణుమూర్తి రూపంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ఓ బిజినెస్ మేగజైన్ కవర్ పేజీలో ప్రచురించడంపై సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమత్ ఫిర్యాదు చేశారు. కాగా కవర్ పేజీపై ప్రకటన కోసం ధోనీ డబ్బులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ గౌడ స్పందిస్తూ.. డబ్బులు తీసుకోనట్టుగా నిర్దారిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధోనీని అదేశించారు. కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ms dhoni  karnataka high court  indian cricketer  denigrating a god case  

Other Articles