MS Dhoni is 9th most marketable athlete in world in London School of Marketings list | forbes Magazine

Ms dhoni is 9th most marketable athlete in world

ms dhoni, ms dhoni news, ms dhoni marketable person, most marketable person, london school of marketings, forbes magazine, dhoni latest updates

MS Dhoni is 9th most marketable athlete in world : After being included in its list of 100 highest-paid athletes in the world by Forbes magazine earlier in the year, Mahendra Singh Dhoni has now found place in London School of Marketing's list of most marketable sports persons in the world.

ధోనీయా మజాకా..?

Posted: 07/24/2015 05:29 PM IST
Ms dhoni is 9th most marketable athlete in world

మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరొందిన మహేంద్రసింగ్ ధోనీ.. గతకొన్నాళ్ల నుంచి అతని సారధ్యంలో టీమిండియా ఎన్నో పరాజయాలు పాలవడంతో అతగాడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ మధ్య టెస్టు ఫార్మాట్ లో వరుసగా టీమిండియా ఓడిపోవడంతో.. తనపై వచ్చిన విమర్శనాస్త్రాలకు రిటైర్ మెంట్ తో తన జవాబిచ్చాడు. దీంతో ధోనీ వన్డే, టీ20 ఫార్మాట్ మ్యాచులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ రెండు ఫార్మాట్ లలోనూ ఇండియా వరుసగా ఓటమి పాలవడుతుండటంతో ధోనీ మీద విమర్శలు మరింత పెరిగిపోయాయి. గతంలో కంటే ఇతని ఇమేజ్ కాస్త తగ్గింది కూడా. కానీ.. ఇతని బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాణిజ్య విలువల్లో ధోనీ ఇమేజ్ అస్సలు తగ్గలేదు.

వివరాల్లోకి వెళ్తే.. లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్-10 స్పోర్ట్స్ పర్సన్స్ (మోస్ట్ మార్కెటబుల్) జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ధోనీకి 9వ స్థానం లభించింది. ఇటీవలే కాలంలో ఇతని మీద విమర్శలు తారాస్థాయిలో పెరగడంతో ధోనీ వ్యాల్యూ పడిపోయిందని అంతా భావించారు కానీ.. ఈ జాబితా మాత్రం అందరికీ షాక్ తగిలేలా నివేదికను వెల్లడించింది. ధోనీపై ఎన్ని విమర్శలొచ్చినా అతని బ్రాండ్ వ్యాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ నివేదిక నిరూపించింది. అంటే.. ఇప్పటికీ చాలా సంస్థలు తమ ప్రోడక్టులను ప్రమోట్ చేసుకోవడం కోసం ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటున్నాయి. అలా తండోపతండాలుగా రావడంతో ధోనీ బ్రాండ్ వ్యాల్యూ ఇతర భారతీయ దిగ్గజాల కంటే పెరిగిపోయింది. ఇప్పటికీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది కూడా!

ఇక ఈ జాబితాలో తొలిస్థానంలో స్విస్ టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ తొలిస్థానంలో నిలువగా.. గోల్ఫ్ ఆటగాడు టైగర్ ఉడ్స్ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే జకోవిచ్ 7వ స్థానంలో, నాదల్ 8వ స్థానంలో వున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఫుట్ బాల్ సూపర్ స్టార్లు క్రిస్టియానా రొనాల్డో, లియోనిల్ మెస్సీ, అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ ల కంటే ధోనీ బ్రాండ్ వ్యాల్యూ అధికంగా వుండటం విశేషంగా మారింది. చివరగా.. భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ జాబితాలో 78వ స్థానంలో నిలిచారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  forbes magazine  london school of marketings  

Other Articles