BCCI suspends Mumbai cricketer Hiken Shah for corruption in IPL | Ipl match fixing

Mumbai cricketer hiken shah suspended for corruption in ipl

hiken shah, ipl controversy, ipl match fixing, hiken shah latest news, mumbai cricketer hiken shah news, hiken shah suspended, ipl fixing controversy, praveen tambe

Mumbai cricketer Hiken Shah suspended for corruption in IPL : The BCCI has suspended Hiken Shah, a Mumbai batsman, with immediate effect after he was found guilty of breaching the board's anti-corruption code for participants.

ఐపీఎల్-8లో మరో ‘మ్యాచ్ ఫిక్సర్’ ఔట్

Posted: 07/13/2015 04:44 PM IST
Mumbai cricketer hiken shah suspended for corruption in ipl

ఐపీఎల్-6 సీజన్ లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు! ఆ ఫిక్సింగ్ బయటపడటంతో ఇండియన్ పేసర్ శ్రీశాంత్ శాశ్వత వేటు వేయించుకున్నాడు. అతనితోపాటు మరో ముగ్గురు యువ ఐపీఎల్ ఆటగాళ్ల కెరీర్ అక్కడితోనే ముగిసింది. ఇక అప్పటినుంచి మళ్లీ అవినీతి చోటు చేసుకోకుండా బీసీసీఐ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఓ ఆటగాడు అందరి కళ్లు కప్పి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నించాడు. కానీ.. అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆ ఆటగాడ్ని బీసీసీఐ సస్పెండ్ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైక్రికెటర్ హికెన్ షా ఐపీఎల్-8లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ప్రవీణ్ తాంబేను ‘ఫిక్సింగ్’కు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. అందుకు ప్రవీణ్ నిరాకరించాడు. పైగా ఈ విషయాన్ని తన ఫ్రాంచైజీకి తెలియచేశాడు. షా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ ‘ఆఫర్’ చేశాడని ప్రవీణ్ పేర్కొనడంతో.. బీసీసీఐ ఈ అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టింది. అతనిపై విచారణ జరిపించగా.. షా నిజంగానే ప్రవీణ్ ను ‘ఫిక్సింగ్’కు ప్రలోభపెట్టేందుకు నిర్ధారణ అయింది. దీంతో ఐపీఎల్ ఆటగాళ్లకోసం రూపొందించిన యాంటీ కరప్షన్ కోడ్ ను షా ఉల్లంఘించాడని.. అందుకే అతనిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇదిలావుండగా.. ముంబై తరఫున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన హికెన్ షా.. 2160 పరుగులు చేశాడు. అద్భుతమైన ఆటతీరుతో అందరి మనసుల్ని దోచుకున్నాడు. కానీ.. ఇంతలోనే ఇతగాడు ఇలా ఫిక్సింగ్ లో అడ్డంగా దొరికిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hiken shah  ipl fixing controversy  praveen tambe  

Other Articles