IPL verdict: 2-year suspensions for Chennai, Rajasthan; life ban for Kundra, Meiyappan

Csk and rr suspended for two years

CSK and RR suspended for two years, Indian Premier League, Chennai Super Kings, Rajastan Royals, Gurunath meuyappan, Raj kundra, verdict on IPL, quantum of punishment, spot fixing, betting scandal, IPL, Indian Premier League, IPL betting, IPL spot-fixing case, Justice RM Lodha committee, Supreme Court, IPL franchises, Betting charges, IPL 8

The Supreme Court appointed Justice Lodha Committee has rendered its verdict and announced the quantum of punishment for Gurunath Meiyappan and Raj Kundra and their respective Indian Premier League (IPL) franchises for the spot fixing and betting scandal

చెన్నై, రాజస్తాన్ జట్లపై రెండేళ్ల నిషేధం.. గురునాథ్, కుంద్రాలపై లైఫ్ టర్మ్

Posted: 07/14/2015 04:54 PM IST
Csk and rr suspended for two years

ప్రపంచవ్యాప్తంగా  కలకలం రేపిన ఐపిఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నియమించిన మాజీ సిజెఐ జస్టిస్ లోథా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సంచలన తీర్పునిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ఈ కమిటీ రెండేళ్ల నిషేధం విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బిసిసిఐ మాజీ అద్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మొయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహభాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల నిషేధం పెట్టింది.

కేవలం ఐపిఎల్ మాత్రమే కాకుండా ఎలాంటి క్రికెట్ టోర్నమెంటులలోనూ వీరి భాగస్వాములకు కాకుండా వారిపై జీవితకాల నిషేధానికి కమిటీ ఆదేశించింది. ఐపీఎల్‌ ప్రతిష్టను మేయప్పన్‌, కుంద్రా దిగజార్చారని లోథా కమిటీ వ్యాఖ్యానించింది. ఐపిఎల్ ఫిక్సింగ్ బారిన పడడం అప్పట్లో సంచలనం రేపింది. బీసీసీఐ మాజీ బాస్ శ్రీనివాసన్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొని తన పదవికి ముప్పు తెచ్చుకున్నారు. అప్పట్లో శ్రీనివాసన్ ఈ పరిణామంపై స్పందిస్తూ తాము నిర్దోషులమని, తాను, తన అల్లుడు ఏ పాపం ఎరుగమని కోర్టును వేడుకున్నా.. న్యాయస్థానం ఈ క్రమంలో జస్టిస్ లోధా కమిటీని ఏర్పాటు చేసి నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. అత్యున్నత న్యాయస్థానం నియమించిన కమిటీ తీర్పును వెలువరించిని నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతున్న శ్రీనివాసన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles