Learnt a lot from Dhoni 'bhai' and happy to have implemented in matches: Rayudu

Learnt a lot from dhoni says rayudu

Learnt a lot from Dhoni says Rayudu, Learnt a lot from Dhoni 'bhai' and happy to have implemented in matches says Rayudu, cricket, ambati rayudu, ms dhoni, team india, india vs zimbabwe 2015, ambati rayudu, india, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim

Pleased with his match-winning hundred in the cliffhanger against Zimbabwe here, Indian batsman Ambati Rayudu said observing MS Dhoni handle pressure has helped him learn how to control the game in tough situations.

ధోని భయ్యా నుంచి చాలా నేర్చుకున్నాను..

Posted: 07/11/2015 08:13 PM IST
Learnt a lot from dhoni says rayudu

జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒత్తిడిని ఎలా జయించాలో తాను టీమిండియా జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చూసే నేర్చుకున్నానని అంబటి రాయుడు స్పష్టం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడు అజేయ సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. అంబటి రాయుడు వన్డే కెరీర్‌లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు సాధించి, భారత్‌కు విజయాన్ని అందించడంతో అటు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 255 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లకు గాను ఏడు వికెట్లను కోల్పోయి 251 పరుగులు చేసింది. కెప్టెన్‌ చిగుంబుర 101 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అంబటి రాయుడుకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం అంబటి రాయుడు మాట్లాడుతూ ధోని ఆట తీరుని తాను ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండేవాడినని ఇప్పుడు అదే తనకు ఎంతగానో సాయపడిందని తెలిపాడు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ఇలాంటి సందర్భాల్లోనే తాను బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ambati rayudu  ms dhoni  team india  india vs zimbabwe 2015  

Other Articles