indian cricket team arrives zimbabwe

Ajinkya rahane led indian team arrives in zimbabwe

ajinkya rahane led indian team arrives in zimbabwe, Team India, Harare, Zim vs Ind, Zimbabwe versus India, Indian tour of zimbabwe, cricket, team india, india tour of zimbabwe 2015, ajinkya rahane, harbhajan singh, twitter

Ajinkya Rahane-led Indian cricket team arrived here for the limited overs series against hosts Zimbabwe starting July 10.

జింబాబ్వే చేరుకున్న రహానే నేతృత్వంలోని టీమిండియా

Posted: 07/08/2015 07:30 PM IST
Ajinkya rahane led indian team arrives in zimbabwe

అజ్యంకె రహానే సారథ్యంలోని టీమిండియా జట్టు జింబాబ్వే రాజధాని హరారేకు చేరుకుంది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు మంగళవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయం నుంచి జింబాబ్వేకి బయలుదేరింది. జింబాబ్వేకు టీమిండియా చేరుకున్న విషయాన్ని జట్టులో సీనియర్ ఆటగాడు, భారత ఆఫ్ స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు ట్వంటీ20లు ఆడనుంది. జులై 10 నుంచి సిరిస్ ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్‌తో జరిగిన సిరిస్‌లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత సీనియర్లకు విశ్రాంతినిచ్చి రహానే నాయకత్వంలో యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 2011లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రహానే ఇప్పటివరకూ 55 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. దీంతో ఇరవై ఏడేళ్లు అజింక్యా రహానే కొత్త కెప్టెన్‌గా నియమితుడు కాగా, ఆయన నేతృత్వంలో ప్రస్తుతం భారత జట్టు సమతూకంగా ఉందని, కనుక జింబాబ్వే పర్యటనలో విజయం సాధించగలమని కెప్టెన్ రహానే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  team india  india tour of zimbabwe 2015  ajinkya rahane  harbhajan singh  

Other Articles