Sunil Narine grooves with his wife after KKR's victory

Sunil narine dances with his wife after kkr s victory

Sunil Narine, Narine grooves, Narine dances, Narine and wife, Andre Russell, Yusuf Pathan, Robin Uthappa, KKR, Kolkata Knight Riders, KKR vs DD, Delhi Daredevils, IPL, IPL 2015, IPL 8, Indian Premier League

Sunil Narine dances along with his wife and Kolkata Knight Riders' team mates.

గెలిచిన ఆనందంలో భార్యమణితో నరేన్ స్టెపులు

Posted: 05/08/2015 05:57 PM IST
Sunil narine dances with his wife after kkr s victory

వెస్టిండీస్ స్పీన్ మాంత్రికుడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు.. సునీల్ నరేన్ నిన్న అరుదైన దృశ్యాన్ని అలకరించాడు. ఎప్పుడో ఫెళ్లైన కోత్తలో తన భార్యతో జతకట్టిచి స్టెపులు వేసిన నరేన్ మళ్లీ నిన్న తన బార్యామణితో కలసి చిందులు వేశాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు గత రాత్రి విజయం సాధించడంతో ఆయన సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్ 7 విజేతలుగా ఈ సారి టార్నోమెంటులో ఢిపెండింగ్ ఛాంఫియన్లుగా అగుడుపెట్టిన కోల్ కత్తా నైట్ రైడర్స్ నిన్న రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది.

దీంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ లో మూడో స్థానాన్ని అక్రమించుకున్న కోల్ కతా నైట్ రైడర్స్.. నిన్న రాత్రి ఢిల్లీ జట్టుపై సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సాధరణంగా మ్యాచ్ గెలిచినప్పుడల్లా సంబరాలు సాధారణమే అయినా.. నిన్నటి సంబరాలలో మాత్రం సునీల్ నరేన్ సతీమణి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్థానికంగా గల నైట్ క్లబ్ లో జట్టు సభ్యులతో కలసి డాన్స్ చేసిన నరేన్.. ఆయన సతీమణితోనూ కలసి స్టెపులేయడం గమనార్హం. అయితే వీరికి తోడు కలిసిన వెస్టీండీస్ ఆటగాడు, కోల్ కతా నైట్ రైడర్ జట్టుకు చెందిన అండ్రీ రసెల్ కూడా పలు బాలీవుడ్ పాటలను పాడుతూ వారి స్టెపులకు గళం కలిపాడు. వీరికి భారత అటగాళ్లు రాబిన్ ఉత్తప్ప, యూసుఫ్ పఠాన్ లు కూడా తోడవ్వడంతో .. నైట్ క్లబ్ మొత్తం సంబరాల్లో మునిగి తేలింది. కాగా భారత్ క్రికెట్ నియంత్రణ బోర్డు తాజాగా మరోమారు సునీల్ నరేన్ బాలింగ్ కు పచ్చజెండా ఊపింది.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata Knight Riders  Narine and wife dances  IPL 8  Cricket  

Other Articles