IPL Franchises getting problems with Indian Premier League cash-rich rules

Ipl franchises getting problems with indian premier league cash rich rules

ipl franchises, mohammad shami, indian premiere league, Delhi Daredevils, mumbai indians team, ipl controversies, Indian cricket players, BCCI, telugu news

IPL Franchises getting problems with Indian Premier League cash-rich rules : The salary clause of the Indian Premier League states that the moment a player, bought at the auction, reports to the team camp, he will have to be paid 50 percent of his contracted amount even if he is injured and unable to take part in the tournament.

ఐపీఎల్ ఫ్రాంచైజీల జీవితాలతో ఆడుకుంటున్న ‘జీతం’

Posted: 05/07/2015 10:51 AM IST
Ipl franchises getting problems with indian premier league cash rich rules

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రేక్షకులకు కనులపండుగగా వుంటే ఆటగాళ్లకు ఎంతో అనుకూలమైన ప్లాట్ ఫారం! అందరిలోనూ ఉత్సాహం పెంచే ఈ ఐపీఎల్.. ఫ్రాంచైజీల్లో మాత్రం నిరుత్సాహం నింపుతోంది. అంతేకాదు.. ఎవ్వరూ ఊహించలేని ఖరీదైన కష్టాలే తెచ్చిపెడుతోంది. ఆటగాళ్లకు అనుకూలంగా నిబంధనలు వున్న నేపథ్యంలో ఈ సీజన్ లో ఫ్రాంచైజీలకు చుక్కలు కనిపిస్తున్నాయని సమాచారం!

వివరాల్లోకి వెళ్తే.. గాయం కారణంగా కనీసం ఒక్క మ్యాచులోనూ బరిలోకి దిగని ఆటగాడికి కూడా యాభై శాతం జీవతం ఇవ్వాలన్న నిబంధన విధించడం జరిగింది. ఈ నిబంధనే ఫ్రాంచైజీలకు తెగ ఇబ్బందులకు గురిచేస్తోంది. అలా తీవ్ర ఇబ్బందికి గురవుతున్న ఫ్రాంచైజీల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఢిల్లీ ఆటగాడైన మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఇంతవరకు ఒక్క మ్యాచులోనూ ఆడలేదు. అయినప్పటికీ ఇతగాడు నిబంధనల ప్రకారం తన యాభై శాతం ఫీజు మాత్రం అందుకోనున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొని ఆయా జట్టు క్యాంప్ లో రిపోర్టు చేసిన ఆటగాడు.. ఆపై టోర్నీలో ఆడకపోయినా వేలంలో దక్కించుకున్న మొత్తంలో యాభై శాతం ఫీజు పొందేందుకు అర్హుడనే నిబంధన వుండటంతో.. ఇతనికీ అలాగే ఫీజు దక్కనుంది. దీంతో షమీకి ఢిల్లీ యాజమాన్యం సగం అంటే రూ. 2.12 కోట్లు వేతనంగా ఇవ్వాల్సి వుంటుంది.

ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి అయితే మరోలా వుంది. ఓపెనర్ అయిన ఆరోన్ ఫించ్ మొదట రెండు మూడు మ్యాచులు ఆడాడు కానీ.. తొడ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇతడు మ్యాచ్ లో గాయపడ్డాడు కాబట్టి.. ముంబై అతనికి మొత్తం జీతం చెల్లించాల్సి వుంది. ఇంతేకాదు.. టోర్నీలో జీతం చెల్లింపు విధానంలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలూ వున్నాయి. వేలంలో ఎంపికై జట్టు ట్రయల్ మ్యాచ్ లో పాల్గొన్న ఆటగాడికి మొత్తం ఫీజు చెల్లించాల్సి వుంటుందని రెండు ఫ్రాంచైజీలకు చెందిన అధికారులు తెలిపారు. ఏదేమైనా.. ఈ ఐపీఎల్ నిబంధనల ధాటికి ఫ్రాంచైజీలకు చుక్కలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl franchises  mohammad shami  Delhi Daredevils  

Other Articles