Former India captain Kapil Dev starts his Twitter innings

Kapil dev finally on twitter

Kapil Dev, finally on Twitter, therealkapildev, former indian Captain, Cricket, India, Kapil Dev, Sports, SportsTracker, Twitter, social media, kapil dev on social media

India's World Cup winning captain Kapil Dev is finally on Twitter. The former all-rounder made his debut in the digital world

నేను ట్విట్టర్ ఖాతా తెరిచానంటున్న కపిల్..

Posted: 05/06/2015 05:31 PM IST
Kapil dev finally on twitter

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. యావత్ దేశం సామాజిక మీడియా మాధ్యమంలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఆయన కూడా తాజాగా ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించాడు. ద రియల్ కపిల్ దేవ్ పేరుతో తన ఖాతాను తెరిచాడు. తన అభిమానులకు ముందుగా ట్విట్ చేస్తూ.. చివరికి నేను కూడా ట్వట్టర్ లో వున్నానని అన్నారు. ఇక్కడ మనం అనేక విషయాలపై చర్చించుకునే అవకాశం వుందన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీతో పంచుకుంటానంటూ ఆయన ట్విట్ చేశారు

ఆ తరువాత భారత టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి టెన్నీస్ వుమెన్స్ డబుల్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కపిల్ దేవ్ శుభాకాంక్షఃలు తెలిపారు. ఆలస్యంగా శుభాకాంక్షఃలు చెబతున్నందుకు చింతిస్తున్నానన్నారు. మరో వైపు ఆయన ప్రధాని దృష్టిలో పడేందుకు కూడా ప్రయత్నించారు. తన మూడో ట్విట్ లో ప్రధాని మంత్రిగారు.. కష్టకాలంలో.. దు:ఖ సాగరంలో మునిగిన నేపాలీయులకు అండగా నిలిచి మీరందించిన సాయం చాలా గోప్పదన్నారు. అంతేకాదు మీతో పాటుగా భారత ఆర్మీ కూడా చేసిన సేవలు ప్రశంసనీయమని కపిల్ ట్విట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Kapil Dev  Twitter  

Other Articles