IPL 8: Glenn Maxwell has disappointed himself, says George Bailey

Aussies batsman maxwell also sad about ipl

ipl 2015, cricket, kings xi punjab, glenn maxwell, george bailey, Kings XI Punjab captain george bailey, washbuckling all-rounder Glenn Maxwell, Australian batsman, world cup 2015, Kings XI Punjab

George Bailey said swashbuckling all-rounder Glenn Maxwell has disappointed himself in the IPL, even as the Kings XI Punjab captain remained optimistic about the team's chances of making it to the play-offs despite seven losses.

రాణించలేకపోతున్నందుకు బాధగా వుంది

Posted: 05/06/2015 05:40 PM IST
Aussies batsman maxwell also sad about ipl

ఇటీవల జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో తన అద్భుత ప్రధర్శనతో రాణించి.. అభిమానులతో పాటు సహచరుల అభిమానాన్ని చూరగోన్న అసీస్ క్రీకెటర్ మాక్స్ వెల్ ఇప్పుడు బాధపడుతున్నాడట. అస్ట్రేలియా జట్టు మరోమారు ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంతో తన వంతు పాత్ర వుండటంతో పాటు.. పలు మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించిన మాక్స్ వెల్ బాధకు కారణం ఏంటో తెలుసా..? ప్రపంచ కప్ లో కనబర్చిన అద్భుత ప్రదర్శనను.. భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కనబర్చలేకపోవడమేనట.

ఈసారి ఐపీఎల్‌లో రాణించలేకపోతున్నందుకు ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ చాలా బాధపడుతున్నాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ బెయిలీ చెప్పాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ‘మ్యాక్స్ చాలా నిరాశలో ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడు. అయితే కొన్నిసార్లు అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోవచ్చు. ఆసీస్‌తో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిని అనుకూలంగా మల్చుకోలేకపోతున్నాడు. బయటి దేశాల్లో ఆడేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. మ్యాక్స్‌పై కూడా ఒత్తిడి అధికంగా ఉంది. అయినప్పటికీ రాబోయే మ్యాచ్‌ల్లో అతను సత్తా చాటుతాడు’ అని బెయిలీ వ్యాఖ్యానించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL8-2015  IPLT20  glenn maxwell  george bailey  Kings XI Punjab  

Other Articles