Srinivasan Forcing Gay Son to Marry Woman to Continue Family Line

Srinivasan forcing gay son to marry woman to continue family line

Srinivasan News, Srinivasan controversy, Srinivasan gay son, Srinivasan gay son ashwin, Srinivasan son ashwin news, Physical Harassement, homosexual case, marriage problems

Srinivasan Forcing Gay Son to Marry Woman to Continue Family Line : Former BCCI Chief N Srinivasan’s son Ashwin, a ‘homosexual’, accused his father for forcing him to marry a woman to continue the family line.

పెళ్లి చేసుకోమని నాన్న వేధిస్తున్నాడు.. శ్రీనిపై కొడుకు ఆరోపణ

Posted: 05/05/2015 11:05 AM IST
Srinivasan forcing gay son to marry woman to continue family line

ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయన.. మొన్నీమధ్యే ఓ లండన్ సంస్థకు భారీ వ్యయం ముట్టజెప్పి తన బోర్డు సభ్యులపై శ్రీ‘నిఘా’ పెట్టించినట్లు వెలువడయ్యింది. ఈ రెండు వ్యవహారాలు ఇంకా అంతుచిక్కుండా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న నేపథ్యంలో.. తాజాగా శ్రీని కొడుకే ఆయన మీద ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

స్వలింగ సంపర్కుడైన అశ్విన్ ని తండ్రైన శ్రీనివాసన్ గతకొన్నాళ్ల నుంచి పెళ్లి చేసుకోమంటూ వేధిస్తూ వస్తున్నాడట! ఓ అమ్మాయిని పెళ్లాడి తన వంశాభివృద్ధికి పిల్లల్ని కనివ్వాలంటూ తండ్రి తనను బలవంతం చేస్తున్నాడంటూ అశ్విన్ ఆరోపించాడు. తన తండ్రి వేధింపులు ఇంకా కొనసాగుతూనే వున్నాయని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు వెల్లడించాడు. అవిముఖర్జీ అనే తన భాగస్వామితో కలిసి వుంటుంన్నందుకు తనను శ్రీని తీవ్రంగా హింసించాడని అశ్విన్ గతంలో ఓసారి ఆరోపించడం కూడా సంచలనాత్మకంగా నిలిచిన వ్యవహారం తెలిసిందే! ఇప్పుడు మరోసారి అమ్మాయిని పెళ్లాడాలంటూ తన తండ్రి ఒత్తిడి తెస్తున్నాడంటూ అశ్విన్ మళ్లీ వార్తలోకెక్కాడు.

ఈ క్రమంలోనే అశ్విన్ తన తండ్రి శ్రీనిపై ఆరోపణలు చేస్తూ.. ‘ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకిచ్చేస్తే నా భాగస్వామి అవితో కలిసి నా బతుకు నేను బతుకుదామనుకుంటున్నాను. కానీ అవి నుంచి నేను విడిపోవాలంటూ మా నాన్న నన్ను వేధిస్తున్నాడు. ఓ అమ్మాయిని పెళ్లాడి పిల్లల్ని కని, వంశాన్ని నిలబెట్టాలన్నది ఆయన కోరిక’ అని తెలిపాడు. అంతేకాదు.. వివిధ సందర్భాల్లో శ్రీని స్వయంగా తనకు రాసిన ఆరు లేఖల్ని కూడా అతడు బయటపెట్టాడు. ‘తన సొంత చేతిరాతతో వున్న లేఖల్ని చూడండి. నా స్వలింగ సంపర్కత్వం ఆయనకు అసహజంగా అనిపిస్తోంది’ అని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivasan Controversy  Srini Gay Son Ashwin  Physical Harassements  

Other Articles