Bangladesh Beat Pakistan After 16 Years

Bangladesh down pakistan by 79 runs in the first odi

Bangladesh down Pakistan by 79 runs in the first ODI, Bangladesh Beat Pakistan After 16 Years, opener Tamim Iqbal, wicketkeeper-batsman Mushfiqur Rahim, Bangladesh’s first win against Pakistan after 1999 World Cup, Shakib Al Hasan, Pakistan captain Azhar Ali, Taskin Ahmed, Rubel Hossain

Bangladesh outplayed Pakistan by 79 runs in the first one-day international in Dhaka on Friday, in only their second win over their rivals in 48 games across all three formats.

పాకిస్థాన్ పై పదహారేళ్ల పత్రీకారాన్ని తీర్చుకున్న బంగ్లాదేశ్

Posted: 04/18/2015 08:19 PM IST
Bangladesh down pakistan by 79 runs in the first odi

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై 16 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకుంది పసికూన బంగ్లాదేశ్. పసికూన అనగానే క్రికెట్ అని అర్ధమైయ్యింది కదూ.. గత పదహారు ఏళ్లుగా ఏ క్రికెట్ లోనూ పాకిస్థాన్ ను ఓడించని బంగ్లాదేశ్.. తొలిసారిగా సోంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో దాయాధులను మట్టికరింపించింది. బంగ్లా పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ తో ఇవాళ జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అతిథ్య జట్టు 79 పరుగులతో విజయాన్ని సాధించింది. బంగ్లా రాజధాని ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన ఆసక్తికర పోరులో నెగ్గిన బంగ్లా ఈ అరుదైన విజయాన్ని పదహారేళ్ల తరువాత పాకిస్థాన్ పై సాధించింది.

1999 ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా పాకిస్థాన్ ను ఓడించిన బంగ్లా.. ఆ తరువాత మళ్లీ 16 ఏళ్లకు ఇవాళ జరిగిన తొలి వన్డేలో పాక్ పై గెలిచింది. మూడు వన్డేల సీరీస్ లో పాక్ పై 1-0తో అదిక్యంలో కోనసాగుతోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత యాభై ఓవర్లలో అత్యధ్భుత ఆటతీరుతో రాణించి 329 పరుగులు సాధించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, సహా ముషాఫిర్ రహీమ్ సెంచరీలతో రాణించడంతో అతిథ్య జట్టు పటిష్ట స్థాయికి చేరింది. తమీమ్ ఇక్బాల్ 15 ఫోర్లు, మూడు సిక్స్ లతో 132 పరుగులు సాధించగా, ముసాఫిర్ రహీమ్ రెండు సిక్స్ లు పదమూడు ఫోర్లతో 106 పరుగులు సాధించారు. వీరిద్దరి మధ్య మూడో విక్కెట్ కు 178 పరుగుల బాగస్వామ్యం నమోదైంది.

వరల్డ్ కప్ లో పాక్ జట్టుకు సారథ్యం వహించిన మిస్బా వుల్ హక్, సీనియర్ ఆటగాడు షాహీద్ అఫ్రీదీలు విరమణ ప్రకటించడంతో వారు లేకుండా బంగ్లాదేశ్ నిర్ధేశించిన భారీ స్కోరును చేధించడంలో బరిలో దిగిన పాకిస్థాన్ జట్టు చతికిల పడింది. అజార్ అలి, హరీస్, మహమ్మద్ రిజ్వాన్ లు రాణించినా.. మిగిలిన ఆటగాళ్లు రాణించలేక చతికిల పడటంతో పాకిస్థాన్ ఇంకా నాలుగు ఓవర్ల నాలుగు బంతులు మిగిలి వుండగానే చాపచుట్టేసింది. బంగ్లా పేస్ బౌలర్ తస్కీన్ అహ్మద్, స్పిన్నర్ అరాఫత్ సన్నీ లు చెరో మూడు విక్కట్లు తీశారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  Pakistan  victory  16 years  

Other Articles